మొదట్లో ప్రధాని మోడీ మిత్రుడు.. ఇప్పుడు శత్రువు ఎలా అయ్యాడు – డీకే అరుణ

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని.. ప్రజలకు కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని అగ్రహించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేసీఆర్ కు ఎప్పుడూ రాజకీయం తప్పితే వేరే ధ్యాస లేదు.. దేశంలో తెలంగాణ తప్పా మరే రాష్ట్రం బాగుపడలేదు అని తండ్రీకొడుకులు గప్పాలు కొడుతున్నారన్నారు.

8 ఏండ్లలో మీరు ప్రజలకు చేసిందేంటి ? 1200 మంది అమరుల త్యాగాల మీద గద్దెనెక్కారని పేర్కొన్నారు. మీరు చేసిన మోసాలకు ప్రజలు గద్దె దించాలని చూస్తున్నారు.. ఆ భయంతో నోటికొచ్చినట్లుగా వాగుతున్నారని మండిపడ్డారు. కుర్చీ కాపాడుకునే యావ తప్పితే ఈ అయ్యా కొడుకులను వేరే ధ్యాస లేదు.. ఇంతకు ముందు ప్రధాని మోడీ మిత్రుడు.. ఇప్పుడు శత్రువు ఎలా అయ్యాడని ప్రశ్నించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.

తెలంగాణకు శత్రువు మోడీ అని కామెంట్స్ చేస్తావా ? మీరు చేసే దోపిడీకి అడ్డు చెప్పకుంటే మిత్రుడు.. లేదంటే శత్రువా ? అని నిలదీశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్నీ మీరే పూర్తిచేశారా ? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదని అగ్రహించారు. కాళేశ్వరం పూర్తి చేస్తే.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయట్లేవు.. కేసీఆర్ ఒక జూటాకోర్ అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version