రాజీనామా పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలతొ,ఇటీవల జరిగిన ఏఐసీసీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదనే అసంతృప్తితో ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఆయన పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లుగా ప్రచారం జోరుగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై మహేశ్వర్ రెడ్డి స్పందించారు.

ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ తో భేటీ అయిన తర్వాత మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్ లోనే కార్యకర్తగా కొనసాగుతానని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందన్నారు మహేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version