మంత్రి కేటీఆర్ ను కలిసిన డీఎంకే నేతలు

-

తమిళనాడు అధికార పార్టీ డిఎంకె ఎంపీలు… ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో కలిశారు. నీట్ పరీక్ష రద్దుకు డిమాండ్ చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో ఈ సందర్భంగా డీఎంకే నేతలు మంత్రి కేటీఆర్ కు అందజేశారు. మంత్రి కేటీఆర్ ను కలిసిన వారిలో డీఎంకే ఎంపీలు ఇలం గోవన్, కళ అనేది వీరస్వామి తదితరులున్నారు.

ఈ సందర్భంగా DMK ఎంపీ ఇలం గోవన్ మాట్లాడుతూ.. నీటి పరీక్ష రద్దు అంశం పై కేటీఆర్ ను కలిసామని.. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నీటి పరీక్ష అంశం పై మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర విధానంపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని.. తమ కు సపోర్ట్ చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆడిగామన్నారు. కేంద్రం కీలకమైన విషయాలలో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదని మండిపడ్డారు. కాగా ఇటీవలే సిఎం కెసిఆర్ కు తమిళనాడు స్టాలిన్.. నీట్ పరీక్ష పై లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version