కుక్కర్‌ కొంటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి!

-

తక్కువ సమయంలో పనైపోతుంది కదా అని చాలా మంది కుక్కర్‌ కొంటారు. అందుకే చాలా ఇళ్లలో ఇవి ఉంటాయి. వేరే అల్యూమినియం పాత్రల్లో అయితే టైం ఎక్కువ పడుతుంది. దీనివల్ల ఎక్కువ శాతం మహిళలు కుక్కర్‌లే వాడుతారు. దీంతో అయితే ఈజీగా అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాలు తక్కువ సమయంలో వండుకోవచ్చు. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రెషర్‌ కుక్కర్‌ వాటటం మంచిది కాదు. అందులో వండిన ఆహారం ఆరోగ్యానికి చేటు. ఇది మీరు నమ్మిన, నమ్మకపోయిన వాస్తవం ఇదేనట. ప్రెషర్‌ కుక్కర్‌కు బదులుగా కడాయి, కుండ లేదా రాగిపాత్రలో వండుకోవాలి.

ప్రెషర్‌ కుక్కర్‌ పని చేసే విధానం

సాధారణంగా ప్రెషర్‌ కుక్కర్‌లో ఆవిరితోనే ఉడుకుతుంది. ఆ ఆవిరి బయటకు పోదు. ఇలా కుక్కర్‌లో ఆవిరి పెరుగుతూ ప్రెషర్‌ ఎక్కువై ఆహారంపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. దాంతో ఆహార పదార్థాలు ఉడికిపోతాయి. అయితే, కొన్ని పరిశోధనల ప్రకారం ఇలా ప్రెషర్‌ పెట్టడం వల్ల ఆహార పదార్థాల్లోని కీలక పోషకాలు నాశనమవుతాయి. అందులోని ఆహారం తీసుకున్న గుండె సంబంధిత వ్యాధులు రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అదే సాధారణ కడాయి, అల్యూమనియం ఇతర వాటిలో వండితే ఆవిరి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంది. వాటిలోని ఫుడ్‌ కూడా రుచిగా ఉంటుంది. రాగి పాత్రలో వండకుంటే మరీ మంచిది. వీటిలో వండి తీసుకున్న ఆహారం వల్ల గాయిటర్‌ సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news