ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూ వస్తోంది. అందులో భాగంగానే వాట్సాప్ తాజాగా మరొక కొత్త ఫీచర్‌ను అందివ్వనుంది. దీని సహాయంతో యూజర్లు తమ ఫోన్‌లో లేని కాంటాక్ట్‌ల నుంచి వచ్చే అవాంఛిత మెసేజ్‌లను హైడ్ చేయవచ్చు. ఇంతకు ముందు ఆర్కైవ్ చాట్స్ అనే ఫీచర్ ఉండేది. అయితే దీనికి మరిన్ని హంగులను కల్పించి కొత్త ఫీచర్‌గా అందిస్తున్నారు.
ఇంతకు ముందు ఆర్కైవ్ చాట్స్ ఫీచర్‌ను వాడుకుంటే అందులో ఏదైనా కొత్త మెసేజ్ వస్తే చాట్ పైభాగంలోకి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. వాట్సాప్ కొత్తగా న్యూ ఆర్కైవ్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో అన్‌వాంటెడ్ కాంటాక్ట్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను శాశ్వతంగా హైడ్ చేయవచ్చు. వాటిని ఆర్కైవ్‌గా చేస్తే వాటికి మళ్లీ కొత్త మెసేజ్‌లు వస్తే చాట్ పై భాగానికి రాదు. కిందే ఉంటుంది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దాన్ని వారు వాడుకోవాలంటే సెట్టింగ్స్‌లోని చాట్స్ ఆప్షన్‌లోకి వెళ్లి కీప్ చాట్స్ ఆర్కైవ్డ్ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఆప్షన్‌ను ఆన్ చేశాక అన్‌వాంటెడ్ చాట్స్ ను ఆర్కైవ్స్‌గా మార్చుకోవచ్చు. ఇకపై ఆ చాట్స్‌కు ఏ మెసేజ్ లు వచ్చినా అవి కిందే ఉంటాయి. పైకి రావు. యూజర్లు ఈ విధంగా అవాంఛిత మెసేజ్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక బీటా దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. కానీ వాట్సాప్ బీటా వెర్షన్ లో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.