కార్తీక మాసంలో ఎట్టిపరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకండి..!

-

కార్తీక మాసంలో చాలా మంది శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటారు. కార్తీకమాసంలో కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. కార్తీక మాసంలో మనస్ఫూర్తిగా భక్తి శ్రద్దలతో పరమేశ్వరుడిని ఆరాధించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మోక్షం లభిస్తుంది. సంతోషంగా జీవించడానికి అవుతుంది. అయితే కార్తీకమాసంలో ఎటువంటి పొరపాట్లను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కార్తీక మాసంలో నూనెని దానం చేయకూడదు. నూనె దానం చేయడం వలన ధన నష్టం కలుగుతుంది.

కార్తీకమాసంలో ఆవనూనె దానం చేస్తే ఆ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు. అలాగే కార్తీక మాసంలో పసుపును ఎవరికి ఇవ్వకూడదు. ఈ మాసంలో పసుపుని దానం చేయడం వలన వ్యక్తి జాతకంలో గురుదోషం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. పొరపాటున కూడా పసుపుని ఎవరికి దానం చేయకండి.

అదే విధంగా కార్తీకమాసంలో ఇనుము ఇవ్వకూడదు. ఇనుము దానం చేయడం వలన శని దోషం కలుగుతుంది కార్తీక మాసం శ్రీమహా విష్ణువుకి సంబంధించినది. అందుకని ఈ నెలలో ఇనుము దానం చేయడం వలన అనవసరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆనందం శ్రేయస్సు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news