ప్రస్తుతం దేశం లో 15 నుంచి 18 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్ ను అందిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలోనే… భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. కొవాగ్జిన్ టీకా తీసుకున్న చిన్నారులు…. తరువాత ఎలాంటి మందులు వాడాల్సిన పని లేదని పేర్కొంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం.. పారాసెటామాల్, పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ మందులు వాడాలని తామేక్కడా సూచనలు చేయలేదని స్పష్టం చేసింది భారత్ బయోటెక్ కంపెనీ.
కొవాగ్జిన్ తీసుకన్న పిల్లలకు.. 3 పారాసెటమాల 500 ఎంజీ టాబ్లెట్లు ఇస్తున్నట్లు తెలిసిందని… అలాంటివి అవసరమే లేదని క్లారిటీ ఇచ్చింది. 30 వేల మందికి పై తాము క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని.. అందులో 10 నుంచి 20 శాతం మందికే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని.. దీనిపై ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలకు అస్సలు పెయిన్ కిల్లర్లు వేయద్దొని స్పష్టం చేసింది. తమ సూచనలు అమలు చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది.