వాస్తు: ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తప్పులు చెయ్యద్దు…!

-

వాస్తు శాస్త్రం మనకి ఇంట్లో మంచి జరగడానికి చూస్తుంది. సరైన దిక్కుల్లో వస్తువులు ఉంచితే ఎలా పాజిటివిటీ ఉంటుంది. మన ఇంట్లో చేసే ప్రతిదీ కూడా మన మీద ప్రభావం పడుతుంది. సరైన దిక్కుల్లో సరైన వస్తువుల్ని అమర్చడం వలన మంచి జీవితం ఉంటుంది.

అదే విధంగా ఆహారం, నిద్ర కూడా వాస్తు శాస్త్రం లో చాలా ముఖ్యం అని పండితులు చెప్తున్నారు. అయితే మరి ఈరోజు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ఏం చేయకూడదు..?, ఏం చెయ్యాలి..? ఇలా అనేక విషయాలు చూద్దాం.

నిద్రపోయేటప్పుడు తలని తూర్పు వైపు లేదా దక్షిణ వైపు మాత్రమే ఉంచాలి. ఉత్తరం వైపు, పడమర వైపు తల పెట్టుకోవడం మంచిది కాదు అని పండితులు అంటున్నారు. పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు తిరిగి పూజ చెయ్యాలి. అలానే ధ్యానం చేయడానికి కూడా ఈ దిక్కులే సరైనవి.

ఆనందం పంచుకోవడం, ప్రేమగా ఉండడం వల్ల శాంతి ఉంటుంది. అతిథుల్ని పిలవడం అతిథిగా మీరు వెళ్లడం కూడా మంచిదే. దక్షిణం వైపు లో వంటని ఎప్పుడు చేయకూడదు. తూర్పు దిక్కు లో ఉండి వంట చేయడం మంచిది.

ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన అద్దాన్ని ఉంచకూడదు. అలానే పాత వస్తువుల్ని తొలగించాలి. బెడ్ రూమ్ లో పనికిరాని వస్తువుల్ని ఉంచకూడదు. అద్దం మంచానికి ఎదురుగా అస్సలు ఉండకూడదు. అనవసరమైన పుస్తకాలు, పనికిరాని కుర్చీలు ఇలాంటివి కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఇలా మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఈ పద్ధతులని అనుసరించండి.

Read more RELATED
Recommended to you

Latest news