మీ పాత ఫోన్‌ నంబర్ పోయిందా..? అయితే మీ డేటా చోరి అయ్యే అవకాశం ఎక్కువ.. ఎలాగో తెలుసా..?

-

మీరు కొత్త నంబర్ తీసుకున్నప్పుడు పాత ఫోన్ నంబర్‌కు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? మొబైల్ క్యారియర్లు తరచూ వాడని పాత ఫోన్ నంబర్లను రీసైకిల్ చేస్తుంటాయి. వాటి మళ్లీ కొత్త వినియోగదారులకు అమ్ముతుంటారు. కొత్త కొత్త నంబర్లు క్రియేట్ చేయలేక.. టైంను ఆదా చేసుకోవడానికి టెలికాం కంపెనీలు మీరు తీసి పడేసిన ఫోన్ నంబర్లను రీసైకిల్ చేస్తాయి. దీంతో మీ పాత నంబర్ కొత్త వినియోగదారుడి చేతిలోకి వెళ్తుంది. అయితే ఒక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. మీ పాత ఫోన్ నంబర్ వేరే వినియోగదారుడి చేతిలోకి వెళ్లినప్పుడు.. మీకు సంబంధించిన సమాచారం వారికి తెలిసే ప్రమాదం ఉంది. ఇది వినియోగదారుల గోప్యత, భద్రత ప్రమాణాలను భంగం కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

మొబైల్
మొబైల్

ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్ నంబర్లను రీసైక్లింగ్ చేసే మొత్తం చర్య వినియోగదారులను భద్రత, గోప్యత ప్రమాదాలకు గురి చేస్తుందన్నారు. రీసైకిల్ చేసిన సంఖ్యలు కొత్త వినియోగదారులు పొందినప్పుడు పాత వినియోగదారుల సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందన్నారు. మీరు మీ సంఖ్యను మార్చినప్పుడు, డిజిటల్ ఖాతాలలో మీ కొత్త సంఖ్యను నవీకరించడం మర్చిపోతారు. ఇప్పటికీ మీ పాత నంబర్‌ను ఇ-కామర్స్ అనువర్తనాల్లో ఉపయోగిస్తున్నారు. కాల్స్, సందేశాలు తెలియకుండానే రీసైకిల్ చేసిన సంఖ్యకు కేటాయించడం జరుగుతుందని, దీని వల్ల మీ కాంటాక్ట్స్, పాస్‌వర్డ్స్, ఎస్ఎంఎస్‌లు కొత్త వినియోగదారుడి చేతికి వెళ్తుందన్నారు. దీంతో మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు అరవింద్ నారాయణన్ తెలిపారు.

ఫోన్ నంబర్‌ను రీసైక్లింగ్ చేయడం వల్ల.. ఆ నంబర్‌పై ఏమైనా డీలింగ్స్ ఉంటే బెదిరింపులు పాల్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎస్ఎంఎస్ ద్వారా, లేదా కాల్ప్ చేస్తూ ప్రైవేట్ నంబర్లతో మీ నంబర్‌కు కాల్ చేసి దాడులకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సిమ్ కార్డు తీసివేసినప్పుడు వినియోగదారులు పాత సిమ్‌కార్డును స్థానిక టెలికాం సంస్థకు వెళ్లి బ్లాక్ చేయించుకోవాలి. అలాగే సిమ్ కార్డ్ తొలగించేటప్పుడు ప్రాథమిక సమాచారాన్ని డిలేట్ చేసేయాలి. అప్పుడే మీరు ఎలాంటి దాడులు, మోసాలకు పాల్పడకుండా ఉంటారు. పాత సిమ్ కార్డు మీద ఉన్న అన్ని లావాదేవీలను మార్చుకోవాలి. అప్పుడే మీరు ఎలాంటి దాడులకు గురికారని ప్రిన్‌స్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news