ముస్లిములు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగల్లో బక్రీద్ ఒక్కటి. ఈ పండగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వవద్దని హోమ్‌మంత్రి మహమూద్ అలీ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా పండగకు జంతువును బలి చేయాలంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా పరస్పరం గౌరవించుకుంటున్నామని ఆయన అన్నారు. అదే తరహాలో బక్రీద్ పండగను జరుపుకోవాలన్నారు.
ఈ సందర్బంగా డీజీపీ మహేందర్‌రెడ్డితో హోమ్‌మంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హోమ్‌మంత్రి మాట్లాడుతూ.. చారిత్రక చార్మినార్ లోని నాలుగు మినార్లు హిందూ, ముస్లిం, సిఖ్, క్రిస్టియన్‌లుగా భావిస్తామన్నారు. ఈ విధంగా అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా గోవులను హిందువులు పూజిస్తున్నందు ఎప్పటిలాగే వాటిని బలి ఇవ్వవద్దని ఆయన కోరారు.
ఇప్పుడు ఉన్న క్లిష్ట సమయంలో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అంతేకాకుండా ఇతరులకు హాని కలిగించకుండా వ్యవర్ధాలను రోడ్లు, వీదుల్లో పారవేయ వద్దన్నారు. ప్రార్ధనలు, జంతువుల అమ్మకం, కొనుగోలు సమయంలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా సురక్షితమైన స్వయం నియంత్రణ పాటించాలని ఆయన కోరారు.