గృహ జ్యోతి స్కీం కింద తెలంగాణలో ప్రభుత్వం 200 యూనిట్లు విద్యుత్ ని ఉచితంగా ఇవ్వబోతోంది. గృహ జ్యోతి పథకం అమలు కి ప్రతి గృహ వినియోగదారుడు తప్పనిసరిగా విద్యుత్ మీటర్ కి ఆధార్ కార్డు రేషన్ కార్డు నెంబర్లను లింక్ చేయించుకోవాలి. ఈ విషయాన్ని ఖమ్మం ఈఏ క్రాంతి సింహ చెప్పారు గృహ జ్యోతి పథకం ద్వారా నెలకి 200 యూనిట్ల ఉచితంగా పొందాలని అనుకుంటే ఇలా లింక్ చేసుకోవడం తప్పనిసరి అని చెప్పారు.
విద్యుత్ బిల్లు తీసే సమయం లో సిబ్బందికి ఆధార్ కార్డుల నెంబర్లని చూపించి విద్యుత్ సర్వీస్ నెంబర్ కి అనుసంధానం చేయించుకోవాలని చెప్పారు రీడింగ్ తీసిన వారి సర్వీస్లకి ఈనెల 12న తర్వాత మళ్లీ వచ్చి వివరాలు తీసుకుంటారని ఏఈ చెప్పారు ఈ విషయంలో వినియోగదారులు ఆందోళన చెందక్కర్లేదని చెప్పారు.