ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ బాగా పెరిగిపోయాయి. గతంలో ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఎక్కువ సమయం పట్టేది. కానీ ఇప్పుడైతే క్షణాల్లో డబ్బులని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. యూపీఐ (UPI) ద్వారా వెంటనే డబ్బులు పంపొచ్చు.
ఇలా పంపాలంటే మీరు డబ్బులని పంపే వ్యక్తికి కూడా యూపీఐ ఐడీ ఉండాలి. లేదంటే అవ్వదు. అప్పుడు వారికి ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బులు పంపొచ్చు. ఒకవేళ కనుక మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే ఆ సేవలని ఎలా వాడాలో చూడండి.
ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు పంపాలంటే ముందుగా యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ www.onlinesbi.com లో లాగిన్ కావాలి.
ఇప్పుడు మేనేజ్ బెనిఫీషియరీ పైన క్లిక్ చేయాలి.
నెక్స్ట్ ఐఎంపీఎస్ బెనిఫీషియరీ సెలెక్ట్ చేయాలి.
వివరాలు ఎంటర్ చేయాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
ఇప్పుడు మీరు పేమెంట్స్ ట్రాన్స్‌ఫర్ ని క్లిక్ చేసి… IMPS Funds Transfer పైన క్లిక్ చేసి Fund Transfer ఓపెన్ చేయాలి.
ఆ తరవాత బెనిఫీషియరీ పేరు సెలెక్ట్ చేయాలి.
అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి.
ఫైనల్ గా కన్ఫర్మ్ చెయ్యండి.
మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా డబ్బులు వెళ్లినట్టు సమాచారం వస్తుంది.
ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్‌లో కూడా ఇలా డబ్బుల్ని పంపచ్చు. రూ.2,00,000 లోపు ఛార్జీలు ఉండవు. ఒక రోజులో ఒక బెనిఫీషియరీని మాత్రమే యాడ్ చేయొచ్చు. బెనిఫీషియరీని యాడ్ చేసిన నాలుగు గంటల తర్వాత యాక్టివేట్ అవుతుంది. రాత్రి 8 గంటల తర్వాత బెనిఫీషియరీ పేరు యాడ్ చేస్తే మరుసటి రోజు ఉదయం 8 గంటల తర్వాతే మనీ ట్రాన్స్ఫర్ చెయ్యడానికి అవుతుంది.