కైకల సత్యనారాయణ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్

టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ… ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

“ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారాని తెలియగానే ఆయన ట్వీట్ చేసిన క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో.. ఆయన్ను ఫోన్లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారని పూర్తి నమ్మకం నాకు ఉంది. ట్రకియా స్తోమి ఈ కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా మళ్ళీ త్వరలో ఇంటికి తిరిగి రావాలని ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్న అప్పుడు ఆయన నవ్వుతూ.. థమ్స్ అప్ సైగ చేసి థాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్థిస్తూ ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరితోనూ ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషం ఉంది.” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.