క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే తప్పక వీటిని తెలుసుకోవాలి..!

-

ఈరోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డు ని వాడుతున్నారు. క్రెడిట్ కార్డ్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. పెరిగిన ఆర్థిక అవసరాలు బ్యాంకర్లు అందిస్తున్న ఆఫర్లు రివార్డులు క్యాష్ బ్యాక్ లని చూసి చాలామంది క్రెడిట్ కార్డులని వాడుతున్నారు. ఎక్కువ లిమిట్ ఉండడంతో క్యాష్ ని మనం తీసుకెళ్లకుండా మనం నచ్చిన వాటిని షాపింగ్ చేసుకోవడానికి కూడా క్రెడిట్ కార్డ్ సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే చాలామంది క్రెడిట్ కార్డు కి భారీగా లిమిట్ ఉందని నచ్చినట్లుగా వాడుతూ ఉంటారు.

కనీసం అవగాహన లేకుండా ఉండడం వలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారు క్రెడిట్ కార్డు ని ఇష్టానుసారంగా వాడటం వలన సిబిల్ స్కోర్ పై అది ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంతో ఏదైనా లోన్లు కావాల్సి వచ్చినప్పుడు బ్యాంకర్లు లోన్ ఇవ్వడానికే ముందుకు రారు. సిబిల్ స్కోర్ తగ్గితే బ్యాంకర్లు మిమ్మల్ని రిస్క్ ఎక్కువ ఉన్న కస్టమర్ల జాబితాలో పెట్టేస్తారు అందుకని క్రెడిట్ కార్డ్ ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పుడే సిబిల్ స్కోర్ బాగుంటుంది. లోన్లు కూడా బాగా వస్తాయి అయితే క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి మరి ఇక చూసేయండి.

ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతం కంటే తక్కువ ఉంటే మంచిది. లక్ష రూపాయలు క్రెడిట్ లిమిట్ ఉంటే రూ.30వేల వరకూ మాత్రమే మీరు వాడుకోవాలి. తరచుగా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తుంటే మాత్రం ఇది ఎక్కువవుతుంది. బిల్లులను సకాలంలో చెల్లించకపోతే మీ రుణం పెరుగుతుంది. ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోండి. ఎక్కువ క్రెడిట్ కార్డులు వద్దు. ఇలా ఈ పొరపాట్లు జరగకుండా చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news