వాస్తు దోషాలు, ఇబ్బంది లేకుండా పిల్లలు ఆనందంగా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ వుంటారు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అలానే వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ఈరోజు వాస్తు పండితులు పిల్లలకి సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం పిల్లలు ఆనందంగా ఉండాలన్నా.. మంచిగా ఏ బాధ లేకుండా ఉండాలన్న ఇలా చేయడం మంచిది.

వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు చదువుకునే గదిలో గ్లోబ్ ని ఉంచడం చాలా మంచిది. గ్లోబ్ ని పిల్లలు చదువుకునే గదిలో ఉంచడం వలన పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తాయి. అదే విధంగా వాస్తు ప్రకారం ఫోటో ఫ్రేమ్ ని ఉంచడం కూడా చాలా మంచిది. ఇది పాజిటివ్ ఎనర్జీ ని కలిగించి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేస్తుంది.
అలానే పిల్లలు చదువుకునే గదిలో అద్దాన్ని ఉంచడం కూడా మంచిది. అద్దం పెట్టడం వలన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి.
చెక్క బొమ్మలను పిల్లల గదిలో ఉంచడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
మంచి స్టోరేజ్ బ్యాగ్స్ ని కూడా పిల్లలు గదిలో ఉంచడం మంచిది.
పిల్లల గదిలో రాయల్ పర్పల్ రంగులతో ఉండే వస్తువులను కానీ కర్టెన్స్ ని కానీ ఉంచితే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది సూర్యకాంతి పిల్లల గదిలో పడేటట్టు ఏర్పాటు చేస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇలా వాస్తు దోషాలని తొలగించి పిల్లలని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news