ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలను మైగ్రేన్ కూడా ఒకటి. చాలా మంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు మైగ్రేన్ సమస్యతో బాధపడతారు. 2019లో మన దేశంలో 213 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఈ సమస్య తో బాధ పడ్డారని స్టడీ చెబుతోంది. అయితే అందులో 60 శాతం మంది మహిళలే ఉన్నారు. కనుక మహిళలు ముఖ్యంగా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే జాగ్రత్త పడాలి.
అలానే మైగ్రేన్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మైగ్రేన్ సమస్య రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం మన జీవనశైలి బాగుండేలా చూసుకోవాలి అని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో సంభవించే అన్ని వ్యాధులకు ఆహారం, సమయపాలన లేని జీవనశైలి ముఖ్య కారణం. మైగ్రేన్ సమస్యతో బాధపడే వాళ్ళు సరిగ్గా ఉడకని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలాగే పెరుగుకి కూడా దూరంగా ఉండాలి. రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం కూడా ముఖ్యం.
మైగ్రేన్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి:
ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం చాలా ముఖ్యం.
అదే విధంగా ఆహారం సాధారణంగా ఉండేటట్టు చూసుకోవాలి. పోషక పదార్థాలు కచ్చితంగా డైట్ లో ఉండాలి.
ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండాలి.
రోజులో కనీసం 30 నిమిషాల పాటు నడవడం లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే చాలా అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండచ్చు.