కేంద్రం బంపర్ ఆఫర్.. యోగా చేయండి.. రూ.1 లక్ష గిఫ్టు పట్టండి..!

-

ప్రతి ఏడాది జూన్‌ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేను నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఆ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ సారి కరోనా కారణంగా ఒకే చోట పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి యోగా చేయడం కుదరదు. కనుక ప్రధాని నరేంద్ర మోదీ ఓ వినూత్న ఆలోచన చేశారు. మై లైఫ్‌ యోగా (MyLifeMyYoga) పేరిట ఓ పోటీని ఆయన ప్రారంభించారు. ఇందులో పాల్గొనదలచిన వారు యోగా చేస్తూ తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలి. అనంతరం దాన్ని MyLifeMyYoga, Ministry of AYUSH పేరిట ట్యాగ్‌ చేయాలి. దాంతోపాటు ఔత్సాహికులు తాము ఉన్న దేశం పేరును కూడా ట్యాగ్‌ చేయాలి. ఈ క్రమంలో అలా వచ్చే వీడియోల్లోంచి ఉత్తమమైన వీడియోను ఎంపిక చేసి వారికి నగదు బహుమతులను అందజేస్తారు.

కాగా ఈ పోటీని రెండు విభాగాల్లో మొత్తం 6 కాంపిటీషన్లుగా విభించారు. ఒకటి పురుషులకు, రెండోది స్త్రీలకు ఉంటుంది. ఒక్కో విభాగంలో 3 కాంపిటీషన్లు ఉంటాయి. 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వారికి ఒకటి, 18 ఏళ్లకు పైబడిన వారికి ఒకటి, యోగా నిపుణులకు ఒకటి చొప్పున కాంపిటీషన్లు ఉంటాయి. వాటిల్లో గెలుపొందిన వారు భారతీయులు అయితే వారికి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.1 లక్ష, రూ.50వేలు, రూ.25వేలను అందజేస్తారు. అదే వారు విదేశీయులు అయితే 2500, 1500, 1000 డాలర్ల చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు.

ఇక ఔత్సాహికులు తమ వీడియోలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌లలో పోస్ట్‌ చేసి వాటికి ట్యాగ్‌ చేయాలి. త్వరలోనే యూట్యూబ్‌కు సపోర్ట్‌ను లాంచ్‌ చేయనున్నారు. కాగా భారత్‌లోని ఔత్సాహిల కోసం పోటీని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. అదే విదేశాల్లోని వారికి అయితే ఐసీసీఆర్‌ పోటీని నిర్వహిస్తుంది. ఈ పోటీ ఇప్పటికే ప్రారంభం కాగా జూన్‌ 21 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత అందులో విజేతలను యోగా నిపుణులైన న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version