డైలీ పప్పు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందిగా..!

-

కొంతమంది డైలీ తమ ఆహారంలో ఏదో ఒక పప్పును పెట్టుకుంటారు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలా..వాటితో కూరలానో లేదా పప్పు, సాంబార్ లానో చేసుకుని తింటారు. పప్పు తినటం ఆరోగ్యానికి మంచిదే..కానీ డైలీ తినటం అసలు మంచిది కాదు..హాస్టల్స్ లో ఉండేవాళ్లకైతే..పాపం డైలీ సాంబర్ లేదా పప్పు ఉండాల్సిందే..అందుకే హాస్టలో ఉన్నవారికి జీవితంలో పప్పు వద్దురా అనిపించేలా పెడతారు.
పప్పుల్లో హై క్వాలిటీ ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తినటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇదంతా కాయిన్ కు ఒకసైడ్ మాత్రమే..రెండో సైట్ కథ వేరుంది.అధిక మొత్తంలో పప్పులు తీసుకోవడం శరీరానికి హాని కలుగుతుంది. ఉదర సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

పప్పులు ఎక్కువ మోతాదులో తినడం వల్ల వచ్చే నష్టాలు

పప్పులను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. మూత్రపిండాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. పప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు వస్తాయట..

ఉదర సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయి. ఆహారంలో పెద్ద మొత్తంలో పప్పులు చేర్చడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. ఎసిడిటీ వేధిస్తుంది. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇది అందరికి తెలిసిన సమస్యే..అందుకే చాలామంది పప్పును పెద్దగా తినరూ.కానీ కొందరు మాత్రం గ్యాస్ వచ్చినా పర్లేదు అని లాగించేస్తుంటారు.

శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు బయటకు రావు. అవి అలాగే శరీరంలో ఉండిపోతే చాలా ప్రమాదం. ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

పప్పులు ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, డీహైడ్రేషన్, అలసట, వికారం, చిరాకు, తలనొప్పి, విరేచనాలు వంటి ఇతర సమస్యలు కూడా కలుగుతాయి.

ఎవరైనా గౌట్‌ (కీళ్ల వాపు) సమస్యతో బాధపడుతున్నట్లయితే.. పప్పు ధాన్యాలను ఎక్కుగా తినకూడదు. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే పప్పు, బీన్స్ తినాలి. పప్పులో ప్యూరిన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

పప్పులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలను తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. ఊబకాయం వల్ల అనేక ఇతర సమస్యలు కూడా వస్తాయి.

అందుకే పప్పును వారానికి ఒకసారి మాత్రమే తినటం బెటర్..రోజు తింటే రోగాలను కొని తెచ్చుకున్నట్లే..ఏదైనా సరే మితిమిరితే అది ప్రమాదానికే దారితీస్తుంది..భోజనం అయినా బంధం అయినా..కంట్రోల్ లోనే ఉండాలి..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news