బిర్యానీ, పులావుల్లో పైన రోస్ట్ చేసిన ఉల్లిపాయలు వేయడం కామన్.. ఇవి తింటానికి భలే టేస్టీగా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయలను తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇలా తినడం మంచిది కాదని అందరూ చెప్తుంటారు. కానీ అన్నీ ఎప్పుడూ చెడ్డవే కావు..మంచివి కూడా ఉంటాయి. అవును ఉల్లిపాయలు ఆయిల్ లో రోస్ట్ చేయడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. తినడం మంచిది కాదు.. ఈ విషయం పక్కన పెడితే.. రోస్ట్ చేసిన ఉల్లిపాయల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయట.. నమ్మడం లేదా..? అవేంటో మీరు చూడండి..!
కాల్చిన ఉల్లిపాయలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలను బలపరచడమే కాకుండా దంతాలను దృఢంగా ఉండేలా చేస్తుందట.
చిల్లీ పొటాటో, సింగపూర్ చౌమీన్, ఇతర ఫాస్ట్ ఫుడ్‌లు బాగా తింటారు..వీటివల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతుంది. కాల్చిన ఉల్లిపాయలను తీసుకోవడం వలన టాక్సిన్స్ సమస్య తగ్గుతుంది.
శరీరంలో వాపులను తగ్గించడంలో కాల్చిన ఉల్లిపాయలు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫ్లమేషన్ సమస్య నుండి ఉపశమనం పొందడంలో సహయపడతాయి. అలా అని మరీ ఎక్కువగా తినకూడదండోయ్..!
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో పీచు పదార్థం బాగా ఉండాలి. పీచు లోపంతో బాధపడేవారు వేయించిన ఉల్లిపాయలను తీసుకోవాలి. ఫైబర్ సరఫరా వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
ప్యాంక్రియాస్ మీద ప్రయోజనకరమైన ప్రభావం చూపుతుంది. ఇది బ్రోన్కైటిస్ మరియు న్యుమోనియాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించగలదు, అందుచే రక్త నాళాలు, రక్తపోటు యొక్క ధమనులు గట్టిపడటంతో బాధపడుతున్న ప్రజల పరిస్థితిపై ఇది ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
డయబెటిక్ పేషెంట్స్ కూడా కాల్చిన ఉల్లిపాయలను తినొచ్చు. ఇందులో కాలరీలు తక్కువగా ఉంటాయి. గ్లూగోజ్ మొత్తాన్ని తగ్గిస్తుంది.
అయితే అతిగా తినకూడదు. రోస్ట్ చేసిన ఉల్లిపాయలు అతిగా తినడం వల్ల.. కడుపులో తిప్పినట్లు, వికారంగా ఉంటుంది.