అభిమానుల కోరిక మేరకు కొన్ని.. కథ డిమాండ్ మేరకు కొన్ని సినిమా ఇండస్ట్రీలో జరిగే పనులు. ఓ సినిమాకు అభిమానులు కీలకం. వారితో పాటే ఇతరేతర ప్రేక్షకులూ కీలకం. అందులో పవన్ ఫ్యాన్స్ తో పాటూ ఇతరులుంటారు. మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పాటూ పవన్ ఫ్యాన్స్ కూడా ఒకే చోట ఒకే ఇంట ఉంటారు. కొట్టేసుకుందామేటి అని తగువు పడేంత సీన్ ఆ ఇద్దరికీ లేదు. అదే విధంగా కేవలం ఓ సినిమాను ఫ్యాన్స్ కోసమే అని చెప్పడం కూడా తప్పు!
ఓ విధంగా ఇది నేరం కూడా ! సినిమా అందరికీ ! సినిమా అందరిదీ ! కొన్ని ఎలిమెంట్స్ వరకే అభిమానులు కానీ అంతా వారే కాదు. కాకూడదు. కథ ఏం చెబితే అది అని ఎన్నో సార్లు మెగాస్టార్ అన్నారు. అంటున్నారు కూడా ! కానీ ఆ మాట పాటించిన దాఖలాలు లేవు. ఎందుకనో స్టాలిన్ లాంటి ఫలితమే ఆచార్య కూడా దక్కించుకుంది. ఆలోచిస్తే ఈ సినిమా కన్నా స్టాలిన్ చాలా అంటే చాలా బాగుంది. కానీ డైరెక్షన్లో మెగా హీరోలు కానీ ఇతరులు కానీ ఇన్వాల్వ్ అవుతారా ? ఇదే డౌట్ చాలా మందికి చాలా కాలం వెన్నాడింది. నేను ఇన్వాల్వ్ కాను చెబుతాను అంతే అని అంటారు పవన్. కొన్ని ఇంప్రవైజ్ చేసి చూపిస్తాను వాళ్లకు నచ్చితే ఓకే అని కూడా పవన్ కానీ చిరు కానీ చెబుతారు. మరి ! తేడా ఎక్కడ కొడుతుంది.
నో డౌట్ ఇప్పటికీ కొరటాల శివ మంచి డైరెక్టర్. అంతకుమించి మంచి కథకుడు. ఏమయ్యాడు ఆ కథకుడు. నాలుగేళ్ల కృషి వృథానే! అదే సందర్భంలో కథలో అదే పనిగా చేసిన మార్పులే ఈ సినిమా విఫలతకు కారణం. ఇది నిజం కూడా ! రామ్ చరణ్ తో పాటే చిరు కనిపించినంత మాత్రాన మానియా అందరినీ ఆకట్టుకోవాలని రూలేం లేదు.అందుకే ఆచార్య ఫెయిల్..ఇదే సందర్భంలో పవన్ కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ! అదే పనిగా నేరు కథలు వదిలి ఇతర భాషల కథలపై ప్రేమ పెంచుకోవడం కూడా తగని పని ! ఇవి ఆయన ఆలోచించాలి. లేదంటే మల్టీ స్టారర్ చిత్రాలు ఆయన చేసినా కూడా చేదు ఫలితాలే వస్తాయి. ఒకప్పుడు సింపుల్ లైన్ తీసుకుని డెవలప్ చేసి సక్సెస్ లు కొట్టారు పవన్ డైరెక్టర్లు కానీ వారే ఇప్పుడు ఫక్తు ఫార్ములా కథలు చెప్పి ఆయన్ను విసిగిస్తున్నారు. కనుక ఎవ్వరైనా మారాల్సిందే ! ఆచార్య నేర్పుతున్న పాఠం ఇదే !