ఎలక్ట్రిక్ టూ వీలర్ (Electric two wheeler ) నడిపే వారికి కేంద్రం శుభవార్తను పంచింది. ఇకపై ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండానే వీటిని రోడ్డు మీదకి తీసుకురావచ్చు. బ్యాటరీ, మిథనాల్, ఇథనాల్ వంటి వాటితో నడిచే ద్విచక్ర వాహనాలకు ఉపశమనం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ వాహనాలు ఎలాంటి అనుమతి పొందాల్సిన పనిలేదు. అనుమతి లేకుండా ఎలాంటి అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చట్టపరమైన వాణిజ్య ప్రయోజనాలు అని గుర్తుంచుకోవాలి. చట్టానికి విరుద్ధంగా వాటిని వినుయోగించితే శిక్ష తప్పదు.
కేంద్రం ఇచ్చిన ఈ ఉపశమనం వల్ల ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇచ్చేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఇది మరింత వెసులుబాటుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో అనేక రకాల అనుమతులు పర్యాటకులకు, అటు అక్కడ నివసించి వ్యాపారం చేసుకునేవారికి ప్రతిబంధకంగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకపోవడం పర్యాటక ప్రాంతంలోని వ్యాపారులకు, పర్యాటకులకు కలిసి వచ్చే అంశం.
ఈ విషయమై కార్ ఆపరేషన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ,రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మేలైనదని, దీనివల్ల పర్యాటక ప్రాంతాల్లోని వారు ప్రయోజనం పొందుతారని, గోవా, ఇతర ప్రాంతాల్లోని వారికి లబ్ది చేకూరుతుందని తెలిపారు.