ఫిలిం నగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో అక్కడే ఉన్న ఓ ఐ20 కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. సినిమా షూటింగ్ కు దగ్గరగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడే ఉన్న కొన్ని షాప్ లకు కూడా మంటలు వ్యాపించినట్టు సమాచారం. అయితే ఇది ఓ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే… ఫిలింనగర్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా షూటింగ్ జనరేటర్ వాహనం నుండి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వాహనంలో డీజిల్ కారడంతో మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ మంటలు రోడ్డు పక్కన ఉన్న షాప్ లకు కూడా వ్యాపించాయి. అలాగే పక్కనే ఉన్న ఐ20 కారుకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. అయితే అక్కడ ఉన్న ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. మంటలు వ్యాపించడంతో షాపు లో ఉన్నవారు పరుగులు తీశారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.