మన ఇంటి చుట్టుపక్కల లేదా..వాడని ప్రదేశాల్లో ఏవేవో పిచ్చిమొక్కలు పెరుగుతాయి. మనం కూడా అవి అన్నీ పనికిరాని మొక్కలే అనుకుని..పెద్దగా పట్టించుకోం.. అలాంటి వాటిల్లో ఒకటి బ్రహ్మి మొక్క. ఈ మొక్కను ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. సర్వసతి మొక్క అని కూడా పిలవబడే ఈ మొక్క పేరుకుతగ్గట్టే..పిల్లల తెలివితేటలకు, జ్ఞాపకశక్తికి బాగా పనికొస్తుందట. యాంటీ ఆక్సిడెంట్లు ఈ మొక్క ఆకుల్లో ఎక్కువగా ఉండటంతో ఈ మొక్క ఆకులు తింటే.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటుంటారు.
ఈ మొక్క పొడి, టాబ్లెట్స్ రూపంలో కూడా సర్జికల్ షాపుల్లో ఉంటుంది. అయితే ఈ మొక్కలో ఇన్ని లాభాలు ఉన్నాయి అని తెలిశాక..అక్కడ ఇక్కడ కొనటం ఎందుకు ఇంట్లోనే పెంచేస్తే సరికదా అనుకుంటున్నారు..అవును ఇది ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అయితే ఈరోజు మనం ఈ మొక్క వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాం.
జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి ఈ ఆకులు పనిచేస్తాయి.
సరస్వతి తైలం చర్మ కణాల పునరుత్పత్తిని ప్రేరేపించడం ద్వారా చర్మం రంగును పెంచుతాయి
గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గించడానికి, ప్రేగు సిండ్రోమ్ చికిత్సకు ఈ మొక్కను ఉపయోగించవచ్చు.
షుగర్ వ్యాధి గ్రస్థులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ ఆకుల రసం తాగడం వల్ల రక్తం శుభ్ర పడుతుంది, రక్త హీనత సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది.
పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ మొక్క ఆకుల రసాన్ని తాగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆకుల రసంలో కాస్త వామును కలిపి మెత్తని పేస్టులా చేసుకుని తినడం వల్ల..చెడు కొలెస్ట్రాల్ కరిపోతుంది.
రోజూ నాలుగు బ్రహ్మి ఆకులను నమిలి తింటే మెదడు పనితీరు మెరుగవుతుందని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం అన్ని ఆయుర్వేద షాపుల్లో ఇది పొడి, టాబ్లెట్స్, లేహ్యం, తైలం .
తెలివితేటలు, ఏకాగ్రత , జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందట.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచింది. అన్నీ అందరికి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని లేదు. మీకు ఈ మొక్క అందుబాటులో ఉంటే..వాడేముందు వైద్యులను సంప్రదించటం ఉత్తమం.
-Triveni Buskarowthu