మన స్టార్ హీరోలకి ఉన్న సొంత రెస్టారెంట్స్,పబ్ ల గురించి తెలుసా.. ఎక్కడున్నాయంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థానాన్ని సొంతం చేసుకున్న తెలుగు హీరోల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళు తమ నటనతో కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాలలో నటిస్తూ దేశం గర్వించదగ్గ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ స్టార్ హీరోలందరూ కేవలం సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు తమ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోకుండా ఎక్కడెక్కడో విలువైన ఆస్తులను భవనాలను కొనుగోలు చేయడమే కాకుండా మరెన్నో రెస్టారెంట్లు పబ్బులను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగు హీరోలకి హైదరాబాదులో పలు రకాల రెస్టారెంట్లు, పబ్ లు ఉన్నట్లు సమాచారం మరియు వాటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. ప్రభాస్:
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ బాహుబలి సినిమా తర్వాత ఇప్పుడు హోటల్ వ్యాపారం లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

2. అల్లు అర్జున్:
ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్వన్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా ఇచ్చిన విజయంతో ఆల్ ఇండియా స్టార్ గా మారిపోయారు ఒకవైపు సినిమాలు మరొకవైపు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటనలు చేస్తూ రెండు వైపులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోని ఈయనకు ఎన్నో వ్యాపారాలతో పాటు హైదరాబాదులో ప్రముఖ హోటల్స్ కూడా ఉన్నాయి. హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ.. ఈ కంపెనీని హైదరాబాద్కు తీసుకురావడానికి ఇవన్నీ అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ ఎం కిచెన్ మరియు కేదార్ సెలగం శెట్టి తో కలిసి పనిచేశారు. ఈ హోటల్ జూబ్లీహిల్స్ లో ఉంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో బీ డబ్స్ అకా బఫే లో వైల్డ్ వింగ్స్ ఫ్లాగ్ షిప్ అల్లు అర్జున్ శ్యామ్ రెడ్డి కేదార్ సెలగం శెట్టి కలసి ప్రారంభించారు.

3. నాగార్జున:
జూబ్లీహిల్స్ వద్ద ఉన్న ఎన్ గ్రిల్.. దీంతోపాటు జూబ్లీహిల్స్ లో ఎన్ ఏషియన్ అని చైనీస్ రెస్టారెంట్ ని కూడా నాగ్ నడిపిస్తున్నాడు..

4. నవదీప్:
గచ్చిబౌలిలో బీట్స్ ఫర్ మినిట్ అకా BPM పబ్బును నవదీప్ నడుపుతున్నాడు.

5. సందీప్ కిషన్:
జూబ్లీహిల్స్ లో ప్రామాణికమైన తెలుగు వంటకాలను అందించే సాంప్రదాయ తెలుగు రెస్టారెంట్ ను నడుపుతున్నారు. ఇక దీనికి వివాహ భోజనంబు అని పేరు కూడా పెట్టారు.

6. మంచు లక్ష్మి:
హైటెక్ సిటీలో జూనియర్ కుప్పన్న అనే సాంప్రదాయ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ను ఈమె నడుపుతోంది.

7. నితిన్:హైదరాబాదులోని కావూరి హిల్స్ లో టీ గ్రిల్ అనే రెస్టారెంట్ ను ప్రారంభించాడు.

Read more RELATED
Recommended to you

Latest news