శివుడికి కందగడ్డకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..!?

-

మహాశివరాత్రి ఈ రోజున ఎక్కడ చూసిన శైవక్షేత్రాలు భక్తుల తాకిడితో శివనామస్మరణతో శివాలయాలు మారుమోగుతాయి. ఇక శివరాత్రికి ముందు రోజు మార్కెట్లో ఎక్కడ చుసిన కందగడ్డలు ఎక్కవగా కనిపిస్తాయి. చాల మంది శివరాత్రి రోజు జాగారం చేసే భక్తులు కచ్చితంగా కందగడ్డలను తమ డైట్‌లో చేర్చుకుంటారు.

sweet-potato

పూర్వ కాలంలో ఆటవిక జాతుల వారు మహాశివరాత్రి రోజున శివుడికి ఆ ప్రాంతంలో దొరికే దుంపలనే నైవేద్యంగా పెట్టేవారు. విచిత్రమేంటంటే ఆ దుంపలు శివరాత్రి పర్వదినం రోజుల్లోనే కనిపించేవట. ఆ దుంపలు మహాదేవుడికి బాగా ఇష్టమైన పుడ్‌గా ఆటవికులు భావించేవారు. అందుకే వాటిని నైవేద్యంగా సమర్పించి శివుడిని ఆరాధించేవారు’ ఆ దుంపలే ఇప్పుడు కందగడ్డలుగా రూపాంతరం చెందినవని అంటారు. అందుకే మహాశివరాత్రి వచ్చిందంటే కందగడ్డలను బాగా విక్రయిస్తారు.

ఇంకో విషయం ఏంటంటే కందగడ్డ పంట వేసినప్పడు సరిగ్గా అవి శివరాత్రికి కొంచెం అటు ఇటుగా చేతికొస్తాయి. అందుకే వాటిని మహాశివరాత్రి సందర్భంగా రైతులు మార్కెట్‌లో విక్రయిస్తారు. అయితే జాగారం చేసేవారికి కందగడ్డ చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వారిని నీరసం నుంచి కాపాడుతూ.. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. అందుకే భక్తులు కందగడ్డను ఈ రోజు ఎక్కువగా తీసుకుంటారు. ఇక కందగడ్డలో ఉండే పోషకాల గురించి ఒక్కసారి చూద్దామా.

ఉప‌వాసం చేసే స‌మ‌యంలో శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు త‌క్కువ అవుతుంటాయి. దీనివ‌ల్ల స్పృహ త‌ప్పే ప్ర‌మాదం ఉంటుంది. అయితే కంద‌గ‌డ్డ‌లు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని వివిధ భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వేగ‌వంతం అవుతుంది. ఇందులోని మిన‌ర‌ల్స్‌, ఐరన్.. శ‌రీరంలోని క‌ణాల సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి. కంద‌గ‌డ్డ‌లో బీటా కెరోటిన్‌, విట‌మిన్ బీ6, సీ, ఈ, ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి వీటిని తిన్న వెంట‌నే శ‌క్తి వ‌స్తుంది. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల కడుపు నిండిన ఫీలింగ్ క‌లుగుతుంది. పైగా త్వ‌ర‌గా శ‌క్తి రావ‌డంతో ఉప‌వాసం చేసే స‌మ‌యంలో ఇబ్బంది అనిపించ‌దు. కంద‌గ‌డ్డ‌లో విట‌మిన్ డీ కూడా అధికంగా ఉంటుంది. దీనివ‌ల్ల ఆరోగ్య‌మే కాకుండా ఎముక‌ల‌కు బ‌లం కూడా అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news