పెదాల పైన ఇలా ఉంటే క్యాన్సర్ అని మీకు తెలుసా..?

-

క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్యాన్సర్ తో కూడా బాధపడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా పెదాల క్యాన్సర్ ఎందుకు వస్తుంది..?, దాని యొక్క లక్షణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. చాలా మందికి పెదాల మీద క్యాన్సర్ ఉన్నట్లు తెలియదు. అయితే మరి పెదవులపై క్యాన్సర్ రావడానికి గల కారణాలు మరియు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 

పెదాలు వాచి పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పెదవుల క్యాన్సర్ కి కారణం. ఎక్కువ అయితే పొగాకు, గుట్కా వంటివి తీసుకునే వాళ్లకి వస్తుంది. ఒకవేళ కనుక పెదవులు వాచిపోయిన లేదు అంటే ఎర్రటి మచ్చలు వచ్చినా ఇది క్యాన్సర్ లక్షణాలు అని తెలుసుకోవాలి. ఇది నోటి క్యాన్సర్ లో ఒక రకం. ఒకవేళ కనుక లక్షణాలను కనుక మీరు గుర్తించారు అంటే తప్పనిసరిగా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ సమస్య నుండి బయట పడడానికి అవుతుంది.

గుట్కా లేదా టొబాకో వంటివి తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్ వ్యాపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఈ అలవాటు నుండి బయట పడడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని కొన్ని సార్లు ఓరల్ హైజీన్ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఒకవేళ ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే అజాగ్రత్త ఉండద్దు. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి సమస్య నుండి బయట పడండి.

Read more RELATED
Recommended to you

Latest news