పరిటాల రవికి వీరసింహారెడ్డి సినిమాతో ఉన్న సంబంధం ఏంటో తెలుసా.?

-

ఈ ఏడాది జనవరి 12వ తేదీన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ వీరసింహారెడ్డి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో శృతిహాసన్ మలయాళ బ్యూటీ హనీ రోజ్ ఇందులో హీరోయిన్స్ గా నటించి సినిమాకి హైలైట్ గా నిలిచారు.. ఏ సినిమా కథను అయినా సరే దర్శకుడు తాను విన్నా లేదా చూసినా.. చదివిన ఘటనల అనుభవాల ఆధారంగా కథను రాసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోని వీరసింహారెడ్డి సినిమా కథను కూడా గోపీచంద్ మలినేని అలాగే రాసుకున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను డైరెక్టర్ గోపీచంద్ మీడియా తో వెల్లడించారు. వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు గోపీచంద్ ఈ క్రమంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ వీరసింహారెడ్డి సినిమాలోని ఇంటర్వెల్ సీను పరిటాల రవి నిజ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా తీసుకొని రాసాను. అంతేకాకుండా పరిటాల రవి చనిపోయే సమయానికి ఆయన అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉందని.. కానీ వెళ్ళలేదు అని కూడా తెలిపారు. ఒకవేళ పరిటాల రవి అమెరికాకు వెళ్లి ఉండి ఉంటే కచ్చితంగా ఆయన మరణించే వారు కాదు అని చాలామంది చెప్పుకుంటారని గోపీచంద్ తెలిపారు.

అంతేకాకుండా వీర సింహారెడ్డి సినిమాలోని కొన్ని సీన్లను పరిటాల రవి జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా రాసుకున్నట్లు తెలిపారు. పరిటాల రవి గురించి చెప్పాలంటే.. ఆంధ్రాలో పేరు మోసిన నాయకులలో ఒకరిగా మాస్ లీడర్ గా అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఆయనను ప్రత్యర్ధులు హతమార్చారు కానీ ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిని అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news