బాబాయిని చంపింది అబ్బాయే అంటూ వివేకానంద రెడ్డి హత్య కేసుపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లిలో నారా లోకేష్ ప్రసంగించారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టాడు..అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు లోకేష్. సీఎం బయటకు వస్తే పరదాల మాటున వటున్నాడు..ప్రజలని చూస్తే భయం.. సీబీఐని చూస్తే ఇంకా భయమన్నారు.
బాబాయిని చంపింది అబ్బాయేనని..యువతకు భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా సైకో పోయి.. సైకిల్ రావాలన్నారు. స్థానిక హైస్కూల్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేవు.. కానీ నాడు – నాడు అంటూ హడావిడి అని.. ప్రజల్లోకి వచ్చినందుకు నాపై ఇప్పుడు 17వ కేసు పెట్టారని ఆగ్రహించారు. ఎన్ని కేసులు పెట్టినా బెదరం..భయపడం…సన్నబియ్యం సన్నాసి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో ఉంచుకోవాలన్నారు. అబద్దాలు చెప్పే సీఎంను అబద్దాలోడే అంటారు సన్నబియ్యం సన్నాసి అన్నారు. ఎవరు ఏపీని అభివృద్ధి చేశారో.. ఎవరు పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరిమారో చర్చిద్దాం రండని…టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ మంత్రి అసెంబ్లీలో చెప్పారని వెల్లడించారు.