ఈ భూ ప్రపంచంలో మూడు రకాల నాగరికతలు ఉన్నాయి.అందులో ఒకటి ఈజిఫ్ట్ కాగా.. రెండోది సింధు నాగరికత. మూడోది మయన్ల నాగరికత. భవిష్యత్తును ముందే ఊహించడం, సూర్యుడిని భక్తితో కొలవడం, పిరమిడ్ల నిర్మాణాలు ఇలా.. మయన్లకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి బాల్‌గేమ్. మధ్య అమెరికా ప్రాంతంలో నివసించిన మయన్లు ఈ క్రీడను ఆడేవారు.
అరిజోనా, న్యూ మెక్సికో, గ్వాటెమాలా, హోండూసార్, బెలిజ్ ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడేవారు. ఇది మామూలుగా ఆడుకొని ఉంటే.. ఆశ్చర్యం అక్కర్లేదు కానీ… చనిపోయిన వాళ్లను రబ్బరు బంతులుగా మార్చి ఆడేవాళ్లు..ఈ గేమ్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మెక్సికో లోని ఆంత్రోపాలజీ, చరిత్ర జాతీయ సంస్థకు చెందిన పురాతత్వవేత్త జువాన్ యాడ్యున్… 2020లో మయన్ల నాగరికతపై పరిశోధనలు చేశారు.ఆ సమయంలో వారికి భూమిలో ఓ నేలమాళిగ కనిపించింది. అది మెక్సికోలోని చియాపాస్ లో ఉన్న తొనీనాలో గల పిరమిడ్‌కి కింద ఉంది. అది వెయేళ్ల నాటిదని తేల్చారు. చీకటిగా ఉన్న ఆ గది లోపలికి వెళ్లిన పరిశోధకులకు అంతా అయోమయంగా అనిపించింది. లోపల గందరగోళంగా కొన్ని మెట్లు ఉండగా, వాటి కింద చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. వాటిలో దాదాపు 400 పాత్రలను గమనించారు. వాటిలో బొగ్గు, బూడిద, మొక్కల వేర్లు, సహజమైన రబ్బర్ ఉండేదని కనుగొన్నారు..
మయన్లను పాలించిన వారి అస్థికలు కావచ్చని పురాతత్వవేత్తలు అంచనా వేశారు. ఆ అస్థికలను రబ్బరు బంతులుగా మార్చడం ద్వారా.. చనిపోయిన వారు ఎప్పటికీ తమతోనే ఉంటారని మయన్లు భావించినట్లు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల.. చనిపోయిన పాలకులు అమరులవుతారని మయన్లు నమ్మి ఉంటారని అంచనా వేస్తున్నారు..కొన్ని రబ్బరు బంతులను కనుగొన్నారు.. అవి మనుషుల ఎముకలతో తయారు చేశారని తేల్చారు.. వాటిని నిజంగా మయన్లు అలా చేశారా..అన్నది తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా కూడా ఇది భయంకరమైన ఆట అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..