చాలా మంది అందంగా ఉండాలని ముఖానికి నచ్చినది రాస్తూ ఉంటారు. అయితే నిజంగా చాలా మంది చేసే తప్పులు గురించి తెలుసుకోరు. ఈరోజు డెర్మటాలజిస్ట్ ఈ పదార్ధాలని అసలు ముఖానికి రాయద్దు అని అంటున్నారు. అయితే మరి ఆ పదార్థాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.
నిమ్మ:
నిమ్మని ముఖానికి అప్లై చేయడం మంచిది కాదు అని డెర్మటాలజిస్ట్ అంటున్నారు. అది ముఖానికి రాయడం ఎసిడిక్ అని అంటున్నారు. నిమ్మని ముఖానికి రాయడం వల్ల ఇరిటేషన్ కలుగుతుంది అలానే చర్మం పొడిబారిపోతుంది.
దాల్చిని:
దాల్చిని కూడా అసలు ముఖానికి రాయకూడదు. దాల్చినిని ముఖానికి రాయడం వల్ల చర్మం ఇరిటేట్ అవుతుంది అలాగే చర్మం రంగు కూడా మారిపోతుంది. దాల్చినిని అప్లై చేయడం వల్ల బర్నింగ్ సెన్సేషన్ కూడా వస్తుందని డెర్మటాలజిస్ట్ చెప్పడం జరిగింది. కాబట్టి ముఖానికి దాల్చిని కూడా రాయొద్దు.
మసాలా దినుసులు:
అన్ని మసాలా దినుసులు ముఖానికి పడవని చెప్పలేము. పసుపు వంటివి ముఖానికి మంచిదే కానీ అన్ని రకాల మసాలా దినుసులు ముఖానికి రాయకూడదు.
కూరగాయల నూనె:
ముఖానికి కూరగాయల నూనెను రాయడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కొబ్బరి నూనెకి బదులుగా కూరగాయల నూనె రాయకండి.
ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ ను కూడా ముఖానికి రాయడం మంచిది కాదు. ఇది కూడా ముఖానికి బాగా ఎసిటిక్. ఇరిటేషన్ ని కలిగిస్తుంది. అలానే మండుతుంది కూడా. చూసారు కదా ఎటువంటి పదార్ధాలని ముఖానికి రాయకూడదో. మరి ఆ పదార్థాలని అస్సలు ముఖానికి మరిచిపోయి కూడా రాయద్దు. లేదంటే ఇబ్బందులు తప్పవు.