Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఇతనే ?

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజ‌యవంతంగా మూడు వారాలను కాంప్లీట్ చేసుకుని.. నాలుగో ఎలిమినేష‌న్ కు సిద్ద‌మ‌య్యింది. ఈ ఎలిమినేష‌న్‌లో ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు వెళ్లిపోతార‌నే ఆస‌క్తి నెల‌కొంది. అయితే గడిచిన మూడు వారాల్లో ముగ్గురిని బయటికి పంపించాడు బిగ్ బాస్.

నాలుగో వారం మరో కంటెస్టెంట్ హెల్మెట్ కానున్నారు. అయితే మూడు వారాల్లో సరయు, ఉమా దేవి మరియు లహరి ఎలిమినేట్ కాగా ఈ ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. ఇక నాలుగో వారం పురుషుడిని ఎలిమినేట్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ లో ఎక్కువ ఓట్స్ పొందిన సిరి, ప్రియా, కాజల్, నటరాజు, లోబో, అని, సన్నీ, డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ 8 మందిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు.

నటరాజ్ మాస్టర్ లేదా అనీ మాస్టర్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో నటరాజు మాస్టర్ మాత్రమే ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ని కంటెస్టెంట్ లను జంతువులతో పోలుస్తూ ఇరిటేట్ చేస్తున్నాడు. మొదట్లో హౌస్ లో గుంటనక్క ఉందని ప్రచారం చేశాడు నటరాజ్ మాస్టారు. బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుంచి… నటరాజ్ మాస్టర్ ప్రవర్తన ఎవరికీ నచ్చడం లేదని ప్రచారం సాగుతోంది. అలాగే నటరాజ మాస్టర్ పద్ధతి ప్రేక్షకులకు కూడా పెద్దగా నచ్చకపోవడంతో ఆయనను ఈ వారం ఎలిమినేట్ చేస్తారని సమాచారం. అయితే దీని పై క్లారిటీ రావాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news