మగువలకు అందం జుట్టు. హెయిర్ ఎంత పొడువుగా ఉంటే.. వాలు జడ వేసుకున్నప్పుడు అంత అందంగా కనిపిస్తారు. హెయిర్‌ను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కెమికల్స్ వాడకుండా సహజ ఉత్పత్తులతో జట్టును కాపాడుతూ వస్తుంటారు. అయితే కొందరు మహిళలు తమ జట్టుపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఖరీదైన ఉత్పత్తులు, పదార్థాలు ఉపయోగిస్తుంటారు. వీటితో మీ హెయిర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్య నెలకొంటుంది. చుండ్రు వంటి సమస్యలు తలెత్తినప్పుడు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువ అవుతుంది. దీంతో హెయిల్ ఫాల్ సమస్య నివారణకు రకరకాల ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. వీటిలో కలప దువ్వెన ఒకటి. కలప దువ్వెన ప్లాస్టిక్ దువ్వెన కంటే చాలా మంచిది. ప్లాస్టిక్ దువ్వెన వల్ల మీ జట్టు రాలే సమస్య పెరగవచ్చు. కానీ కలప దువ్వెన వల్ల అలాంటి సమస్య ఉండదు. అయితే కలప దువ్వెన వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది..
కలప దువ్వెనలు చాలా తక్కువ బరువును కలిగి ఉంటాయి. మృదువైన ముళ్ల గరికెలు ఉంటాయి. దీంతో తల దువ్వుకున్నప్పుడు మెదడులో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మైండ్ చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. మెదడు వెంట్రుక నరాలు చురుగ్గా పనిచేస్తాయి. రక్త ప్రసరణ పెరిగి జట్టు నాణ్యత మెరుగుపడుతుంది. అలాగే సహజ సిద్ధమైన నూనె ఉత్పత్తి అవుతుంది. చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు తొలగిపోతాయి.
జట్టు రాలే సమస్య తక్కువ..
కలప దువ్వెనతో దువ్వుకున్నప్పుడు జట్టు రాలే సమస్యను పరిష్కరించవచ్చు. మీరు ప్లాస్టిక్ దువ్వెనలు వాడుతుంటే.. మీకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే.. కలప దువ్వెనకు మారడం ఉత్తమం. కలప దువ్వెనతో జట్టు చిక్కుముడి సమస్య తక్కువగా అవుతుంది. దీంతో మీ జట్టు ఎక్కువ ఊడిపోదు. జట్టు తడిగా ఉన్నా.. పొడిగా ఉన్నా.. ఎలాంటి సమస్య రానియకుండా చేస్తుంది.
చుండ్రు సమస్యను తగ్గిస్తుంది..
సాధారణంగా ప్రతిఒక్కరికీ చుండ్రు సమస్య ఉంటుంది. హెయిర్, తల పొడిబారడం వల్ల చండ్రు సమస్య ఏర్పడుతుంది. అయితే ఇదివరకే చెప్పుకున్నాం. కలప దువ్వెనతో నెత్తి దువ్వుకున్నప్పుడు రక్త ప్రసరణ మెరుగు పడుతుందని, దీంతో తలపై సహజ సిద్ధమైన తేనే ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నాం. నెత్తి పొడిగా ఉండకుంటే చుండ్రు సమస్య దరిచేరదు. పదునైన ప్లాస్టిక్ దువ్వెనలు నెత్తిమీద చికాకు కలిగిస్తాయి. కానీ కలప దువ్వెనలు స్మూత్‌గా ఉంటాయి. హెయిర్ కూడా డ్యామేజ్ కాదు. చండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.
జుట్టు మెరిసేలా చేస్తుంది..
కలప దువ్వెన వాడటం వల్ల జట్టు ఎక్కువగా మెరుస్తుందట. కలప దువ్వెనతో దువ్వుకున్నప్పుడు సహజమైన నూనె ఉత్పత్తి అవుతుంది. ఈ నూనె జట్టు మొత్తం వ్యాపించడం వల్ల సహజంగానే జట్టు మెరుస్తుంది. జట్టు పొడి బారకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కలప దువ్వెన కొనేసేయండి.