ఎన్టీఆర్ తొలి పారితోసికం ఎంతో తెలుసా!.. మ‌రీ అంత‌నా?

-

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ది చెర‌గ‌ని ముద్ర అని చెప్పాలి. ఈ హీరోకి ఉన్నంత మాస్ బేస్ అభిమానులు ఎవ‌రికీ లేర‌నే చెప్పాలి. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసిన ఈ హీరోకు రెమ్యున‌రేష‌న్ ఎంత అంటే.. కోట్ల‌లో అనే చెప్తారు క‌దా. మ‌రి ఆయ‌న మొద‌టి సినిమాకు ఎంత తీసుకున్నారో తెలుసా.

 

త‌న మొద‌టి సినిమా నిన్ను చూడాల‌ని. ఈ సినిమాను ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పెద్ద‌గా ఆడక‌పోయినా.. ఎన్టీఆర్‌కి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది.

తొలి సినిమాకి ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం రూ.4 లక్షలు. అవును నిజ‌మండి. ఈ పారితోషికాన్ని రామోజిరావు నుండి అందుకున్నాడు ఎన్టీఆర్‌. ఆ డబ్బు తీసుకుని త‌న త‌ల్లికి ఇచ్చాడు. అంతే కాదు నిత్యం వాటిని లెక్కపెట్టేసి తిరిగి తల్లికి ఇచ్చేస్తూ ఉండేవాడట. ఈ విష‌యాల‌ను ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్ఉప‌డు మాత్రం కోట్ల‌ల్లోనే రెమ్యున‌రేష‌న్ ఉంటుందని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news