శరీరానికి విటమిన్స్ పోషకాలు అందించే గింజలలో సన్ ఫ్లవర్ సీడ్స్ ఒకటి. రుచికరమైనవి మాత్రమే కాక ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించేవి సన్ ఫ్లవర్ సీడ్స్ (పొద్దుతిరుగుడు గింజలు) ఈ గింజలు విటమిన్E, విటమిన్ B(B1,B6) వంటి ముఖ్యమైన విటమిన్లను కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం..
విటమిన్ E: సన్ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్E అత్యధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లను పనిచేస్తూ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచడంలో అలాగే ముడతలు తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాక విటమిన్ E గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్త ప్రసరణ మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. ఇక రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
విటమిన్ B: పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ B1 సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. B1 (థయమిన్), B6, ఫోలేట్ వంటి విటమిన్ B గ్రూప్ కి సంబంధించిన పదార్థాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇవి శరీరానికి శక్తిని ఉత్పత్తి చేయడమే కాక నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది గర్భిణీ స్త్రీలకు ఫోలేట్ చాలా అవసరం ఇది గర్భంలో శిశువు మెదడు, వెన్నుముక అభివృద్ధికి సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు : విటమిన్లతో పాటు, ఈ సన్ ఫ్లవర్ సీడ్స్ లో మెగ్నీషియం, సెలీనియం, జింక్ వంటి ఖనిజాలు ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరానికి సహజ రక్షణను ఇస్తాయి.

ఎలా ఉపయోగించాలి: సన్ ఫ్లవర్ సీడ్స్ ను తినేముందు కొద్దిగా వేయించి తీసుకోవాలి. వీటిని సలాడ్ లో ఓట్స్ లో తీసుకోవచ్చు. రోజుకు సుమారు 30 గ్రాములు కన్నా తక్కువ తింటే సరిపోతుంది. అయితే వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
సన్ ఫ్లవర్ సీడ్స్ విటమిన్ E, విటమిన్ B తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యం రోగనిరోధక శక్తి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ గింజలను మీ ఆహారంలో చేర్చడం వల్ల సహజంగా ఈ విటమిన్ల ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలిలో భాగంగా వీటిని మితంగా ఆహారంలో చేర్చడం మంచిది.
గమనిక:ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఎటువంటి లక్షణాలు ఉన్నా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.