బ్రిటన్ కొత్త రకం వైరస్ పేరు ఏంటో తెలుసా …!?

-

భారతదేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. బ్రిటన్ దేశం నుంచి ప్రయాణికుల ద్వారా దేశంలోకి వచ్చిన ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య దేశంలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కరోనా కొత్త రకం వైరస్ కేసులు నమోదైనట్టుగా కేంద్రం చెబుతుంది. యూకే నుండి వచ్చిన వారిలోనే ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు….బ్రిటన్ లో వెలుగులోకి వచ్చి, ఆపై ఇండియా సహా పలు దేశాలకు విస్తరించిన కొత్త కరోనా స్ట్రెయిన్ శరవేగంగా వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్నటికి కొత్త కరోనా కేసులు కేవలం ఆరు మాత్రమే ఉండగా, 24 గంటల వ్యవధిలో మొత్తం 20 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది.ప్రస్తుతం చైనా నుంచి ఊడిపడ్డ కరోనా పరిస్థితుల నుంచి దేశం బయటపడింది. అయితే బ్రిటన్ దేశంలో మరింత స్ట్రాంగ్ గా తయారైన కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిధాటికి ఎంత మంది బలి అవుతారోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.

ఇప్పటిదాకా బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మాత్రమే ఈ వైరస్ లక్షణాలు కనిపించాయని.. స్థానికంగా వ్యాప్తి చెందలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటిదాకా 20 మందిలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించినట్లు తేలింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఉత్తర ప్రదేశ్ మహారాష్ట్రల్లో కొత్త కరోనా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దేశ రాజధానిలోని క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయి.. రాజమండ్రికి చేరుకున్న మహిళలోనూ కొత్త కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.ఉత్తర ప్రదేశ్లో రాష్ట్రంలోనూ బ్రిటన్ కరోనా కలకలం సృష్టించింది. మీరట్కు చెందిన రెండేళ్ల చిన్నారికి కొత్త కరోనా వైరస్ సోకింది.

ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ లో నిర్వహించిన పరీక్షల్లో.. ఆ పాపకు సోకింది సాధారణ కరోనా వైరస్ కాదని తేలింది. బ్రిటన్లో పుట్టుకొచ్చిన కొత్త కరోనా వైరస్ వేరియంట్ బీ.1.1.7గా నిర్ధారించారు. ఇదే సమయంలో కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పాటిస్తుంటే, కొత్త వైరస్ కూడా సోకకుండా ఉంటుందని సీసీఎంబీ పేర్కొంది. మాస్క్ లు, భౌతికదూరం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కొత్త స్ట్రెయిన్ కు కూడా దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version