దూసుకుపోతున్న ‘కార్తీకేయ-2’.. ఈ చిత్రానికి నిఖిల్ తీసుకున్న పారితోషికం అంతేనా?

-

చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తీకేయ-2’ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్నది. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేస్తున్న ఈ ఫిల్మ్ ..అంచనాలను మించి వసూళ్లు చేస్తు్న్నది. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం ‘కార్తీకేయ’ ను మించి ప్రజలకు నచ్చుతున్నదని సినీ పరిశీలకులు చెప్తున్నారు.

కృష్ణతత్వంతో పాటు హిస్టరీ వర్సెస్ మైథాలజీ అనే అంశంపైన దర్శకుడు సినిమాలో చక్కగా చర్చించారు. ముఖ్యంగా అనుపమ్ ఖేర్ పాత్ర రాగానే థియేటర్లలో జనాలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘ధన్వంతరి వేద్ పాఠక్’గా అనుపమ్ ఖేర్ చెప్తున్న మాటలు విని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సినిమా ఇంకా నెక్స్ట్ లెవల్ లోకి వెళ్తుందని చెప్తున్నారు సినీ ప్రియులు.

ఇక ఈ సినిమా రిలీజ్ టైమ్ లో హీరో నిఖిల్ చాలా టెన్షన్ పడ్డారు. రిలీజ్ డేట్ విషయమై తము కొంచెం ఆలస్యంగా వస్తు్న్నామని బాధపడ్డారు. కానీ, రిలీజ్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలాంటి బజ్ లేకుండానే సినిమాను దేశవ్యాప్తంగా విశేషంగా ఆదరిస్తున్నారు.

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లు ఇంటర్వ్యూల్లో హీరో నిఖిల్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ సినిమాకు నిఖిల్ కేవలం రూ.మూడున్నర కోట్లు మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రూ.వంద కోట్ల క్లబ్ లో చేరిన ‘కార్తీకేయ-2’ ఇంకా రికార్డు వసూళ్లు చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘కార్తీకేయ-3’ కూడా రావాలని ఈ సందర్భంగా సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version