ప్రముఖ సినీ సీనియర్ నటి జమున వెండితెర సత్యభామగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే నిన్న ఆమె హైదరాబాదులోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ వయసు మీద పడడంతో 86 సంవత్సరాల వయసులో మరణించారు. ఆమె మరణం ఒక్క సినీ ఇండస్ట్రీనే కాదు అటు రాజకీయ రంగాన్ని కూడా కుదిపేసింది. ఇందిరాగాంధీ హయాంలో రాజకీయంలో కూడా చక్రం తిప్పిన ఈమె ఆ తర్వాత బిజెపిలోకి చేరి వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు వారి తరఫున ప్రచారం కూడా చేపట్టింది.
ముఖ్యంగా తెలుగు, హిందీ తో పలు దక్షిణాది భాషల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జమున ఎన్నో సినిమాలలో విలక్షణమైన పాత్రలలో నటించి తనను తప్ప మరెవరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించి.. తన నటనతో మెప్పించింది. సావిత్రి కి చెల్లి పాత్రలో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన జమున ఆమెను నిజజీవితంలో కూడా సొంత అక్కయ్య లాగే ఊహించుకొనేది. ఎన్టీఆర్ , ఏఎన్నార్ జమునకు అవకాశాలు ఇవ్వని సమయంలో కూడా ఆమె 18 సినిమాలలో నటించారు అంటే ఆమె స్థాయి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే నటిగా ఈమె భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. జమున ఆస్తులు విలువ అటూ ఇటుగా సుమారుగా 100 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ఆమెకు జూబ్లీహిల్స్ లో ఒక ఖరీదైన 2000 వేల గజాల భవంతి కూడా ఉంది. కొండాపూర్ లో ఒక ఫ్లాట్ తో పాటు పాత బంగ్లా కూడా ఉంది. ముఖ్యంగా ఆమె చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పనిలేదు పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినప్పటికీ తన తప్పు ఉంటే క్షమాపణలు చెప్పేది అంత గొప్ప గుణం కలిగిన ఈమె నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.