మరణించిన తర్వాత ఏ తప్పుకు ఎలాంటి జన్మ లభిస్తుందో తెలుసా..?

-

జీవించి ఉన్నంతకాలం నలుగురికీ సహాయపడుతూ ఉన్నదాట్లో సంతోషంగా జీవించాలి అని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతే కాదు ఏదైనా తెలిసీ తెలియక చేసిన తప్పులకు కూడా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మరి ఈ జన్మలో మనం ఏదైనా తప్పు చేస్తే మరణించిన తర్వాత ఆ తప్పు కి ఎలాంటి కర్మను అనుభవించాలి.. ఎలాంటి జన్మ లభిస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం..అబద్దాలు ఆడిన వాడు నత్తి వాడిలాగా, దేవుని సొమ్ము దొంగలించిన వాడు అంగం నొప్పితో మరు జన్మలో బాధ పడతాడు.విషం పెట్టి చంపిన వాడు ఉన్మాదిలా గాను లేక పిచ్చివాడిగా పుడతాడు.

గుడిసెలు తగలబెట్టిన వాడు పుట్టుకతోనే బట్టతలతోను. అన్నం దొంగలించిన వాడు ఎలుక గా పుడతాడు. దాన్యం దొంగలించినవాడు మిడత గాను, వజ్రాలు దొంగలించినవాడు హీనుడుగా పుడతాడు. బంగారం దొంగలించినవాడు పిప్పళ్ల తోనూ, ఇనుప సామాన్లు దొంగలించినవాడు పేదరికంతో పుడతాడు. నీటిని దొంగలించినవాడు చాతక పక్షులు లాగా పుడతాడు. కూరగాయలను , ఆకుకూరలను దొంగలించినవాడు నెమలి గా,పరిమళద్రవ్యాలు దొంగలించినవాడు చుంచులా పుడతాడు. మాంసం దొంగలించినవాడు గ్రద్ద గాను, తేనెను దొంగలించినవాడు దోమ లాగా, ఉప్పును దొంగలించినవాడు చీమ లాగా పుడతాడు.

విషం తాగి ఆత్మహత్య చేసుకున్న వాడు నల్లత్రాచులా, మాంసం దొంగలించినవాడు కసాయి దగ్గర మేకలా పుడతాడు. వ్యభిచారం చేసిన వాడు ఏనుగులా పుడతాడు. సంధ్యావందనం మానినవాడు కొంగల పుడతాడు. రోజు గొడవపడే స్త్రీ జలగ లాగా, గురువు అవమానించిన వాడు పశువు లాగా, పిలిచి దానం ఇవ్వనివాడు అడవి నక్కలాగా, పరస్త్రీని కావాలనుకునేవారు పిశాచి లాగా, పరపురుషుని కావాలనుకునే స్త్రీ బల్లి లాగ పుడుతుంది. వంశం ని అవమానించిన వాడు పిండ దశలోనే మరణం పొందుతాడు. స్నేహితుడినీ మోసం చేసినవాడు అడవి పావురంలా, వ్యాపారంలో మోసం చేసినవాడు గ్రద్ద లాగా, భర్తను మోసం చేసిన స్త్రీ రెండు తలల పాము లాగా, రాజు భార్యను, లేదా స్నేహితుడి భార్యను మోహించిన వాడు గాడిద లాగ, తండ్రిని అవమానించిన వాడు క్షయ రోగి లాగా పుడతారు.

ఎవరికీ పెట్టకుండా తినేవాడు పిల్లలు లేకుండా, అడవి తగలబెట్టిన వాడు ఎద్దు లాగాను పుడతారని మహావిష్ణువు సెలవిచ్చాడు. అప్పుడు గరుత్మంతుడు చనిపోయిన వారిని నేల పై ఎందుకు పడుకోబెడతారని అడగగా మహావిష్ణువు ఇలా చెబుతాడు. మరణించిన వారిని నేలపై నువ్వులు వేసి దర్భల పై పడుకోబెడతారు. నువ్వుల నుంచి దర్బలు , రోమాల నుంచి పుడతాయి. అవి వేసి శవాన్ని పడుకో పెట్టడం వల్ల ఆ భూమి అంతా స్త్రీలాగా పుణ్యవతి గా మారి ఆ మరణము పొందిన మనిషి పాపాలు అక్కడే సగం వరకు తొలగిపోతాయి. మనిషిని పాతి పెట్టే స్థలమును గోమూత్రంతో పవిత్రం చేయకపోతే పిశాచులు, యమభటులు క్రిమికీటకాల గా మారి ఆ మనిషిని పీక్కు తింటాయనీ చెబుతారు. ఈ విధంగా ఏ ఏ పాపాలకు ఏ విధంగా శిక్ష లు ఉంటాయి అని మహా విష్ణువు గరుత్మంతుడుని సందేహాలకు జవాబులు చెబుతాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version