డస్టర్ క్లాత్ పసుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

-

కార్లు, బైకులు, ల్యాప్ టాప్ లు, టీవీలు.. ఇలా దేన్ని తుడవాలన్నా మనం ఉపయోగించేది ఒకటే క్లాత్. అదే డస్టర్ కాత్. అది కూడా పసుపు రంగులోనే ఉంటుంది. మీరు డస్టర్ క్లాత్ ను ఎక్కడైనా తీసుకోండి… కలర్ మాత్రం పసుపులోనే ఉంటుంది. ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా డస్టర్ క్లాత్ రంగు మాత్రం పసుపే. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అసలు ఏనాడైనా ఆలోచించారా అసలు డస్టర్ క్లాత్ పసుపు రంగులో ఎందుకుంటుందని… లేదు కదా.. పదండి.. కనీసం ఇప్పుడైనా తెలుసుకుందాం దాని పుట్టుపూర్వోత్తరాలు..

మామూలుగా క్లీనింగ్ కోసం కాటన్ ను ఉపయోగిస్తారు. ఒకప్పుడు కాటన్ తో తయారయ్యే ప్యాంట్లను వేసుకునేవారట. వాటికి ఓ పేరు కూడా ఉంది. నన్ కీన్ ట్రౌజర్స్ అంటారు ఆ ప్యాంట్లను. ఆ ప్యాంట్లు పాతగ అయినప్పుడు వాటిని ముక్కలు ముక్కలుగా చేసి క్లీనింగ్ క్లాత్ గా వాటిని ఉపయోగించేవారట.

అదే కాలంలో వెన్నను తీయడానికి.. జున్నును తయారు చేయడానికి ప్రత్యేకమైన క్లాత్ ను వాడేవారట. దాన్నే మస్లిన్ అనేవారట. ఆ క్లాత్ కు మరకలు అంటకుండా ఉండేందుకు దానికి పసుపు రంగు డై చేసేవారట. అలా.. అలా.. పసుపు రంగు క్లాత్ లకు గిరాకీ పెరగడం ప్రారంభమైంది.

దీంతో నేతన్నలు కూడా పసుపు రంగు క్లాత్ లను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. పసుపు రంగు అంటే శుభ్రతకు చిహ్నం కాబట్టి.. శుభ్రం చేసే క్లాత్ లను కూడా పసుపు రంగులో మారిస్తు బాగుంటుందని డస్టర్ క్లాత్ లను కూడా పసుపు రంగులో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. వాటికి బాగా గిరాకీ పెరిగింది. కస్టమర్లు ఎక్కువగా పసుపు రంగు ఉన్న క్లాత్ లనే ఇష్టపడుతుండటంతో.. నేత పనివారు వాటినే ఎక్కువగా ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. కాలక్రమేణా… అంతా పసుపు రంగు డస్టర్ క్లాత్ లనే ఉపయోగిస్తున్నారు. అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. అది డస్టర్ క్లాత్ కథ.

Read more RELATED
Recommended to you

Latest news