వధువుకి మెట్టలు ఎందుకు తొడుగుతారో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

హిందూ సంప్రదాయంలో పెళ్లి అయిన మహిళలు తప్పనిసరిగా మట్టిగాజులు, ముక్కుపుడక, కాళ్లకు మెట్టెలు, మేడలో తాళి ధరించాలి వంటి నియమాలను మన పూర్వీకులు సంప్రదాయాలుగా పెట్టారు. హిందూ సంప్రదాయంలో ప్రతి పనికి ఒక్క రహస్యం ఉంటుంది. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకూ ఆయువు పట్టు వంటిది. దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంటుంది. కనుక ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని… అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం వచ్చింది.

hindu women

అయితే కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుంది. కాలికి మెట్టెలు ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. దీంతో వారి రుతు క్ర‌మం స‌రిగ్గా ఉంటుంద‌ట‌. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది.

ఇక వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌. మెట్టెలు వెండితో చేసినవి ధరిస్తారు.. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల..భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది..అందుకే వెండితో చేసిన మెట్టలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు.

స్త్రీలు వారి చేతికి వేసుకొనే గాజులు, కాళీ మెట్టలు రెండు కూడా సంతానాబివృద్ధికి, సుఖ ప్రసవం అవడానికి అనుకూలించే నాడులను సున్నితంగా నొక్కుతు ఉంటాయి. అందువల్ల మన పూర్వికులు వధువుకి కాళ్ల మెట్టలు ధరించడం సంప్రదాయంగా చేర్చారు. ఈ మెట్టలు వధువుకి వివాహిత అని చెప్పే మరో గుర్తు. వివాహతంతులో వధువు పాదాన్ని రోకలిపై ఉంచి వరుడు వధువు కాలి వేలుకి తోడుగుతాడు. వీటిని ఒక్కక్క ప్రాంతంలొ ఓక్కలా తొడుగుతారు. కొన్ని చోట్ల వదువు పుట్టింటి వాళ్ళు తొడిగితే మరి కొన్ని చోట్ల మెట్టినింటివారు పెడతారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...