పడుకునేటప్పుడు ఇలా నిద్రపోతున్నారా.. అయితే ఈ వ్యాధుల బారిన పడినట్టే..?

-

ఎక్కువమంది ప్రజలు పలు రకాలుగా నిద్ర పోతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోవడం అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ వయస్సు కలిగిన మహిళలు మాత్రం ఎక్కువగా నిద్ర పోయేటప్పుడు లైట్ ఆన్ చేసుకొని నిద్ర పోతారట. అయితే ఇలా నిద్ర పోయిన వారిలో ఎక్కువగా రక్తపోటు సమస్య , ఊబకాయం సమస్య కలిగి ఉన్నట్లుగా కొంతమంది వైద్యులు పరిశోధనలో తెలియజేయడం జరిగింది. లైట్ ఆఫ్ చేసి పడుకునే వారి కంటే లైట్ వేసుకొని పనుకొని వారిలోని ఈ సమస్య ఎక్కువగా ఉందని నివేదికలో తెలియజేయడం జరుగుతోంది.

మన స్మార్ట్ మొబైల్ లేదా రాత్రుల్లో టీవీ లైట్ వంటివి చూడడం వల్ల.. ఎక్కువగా మధుమేహ , హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందుచేతనే రాత్రిళ్ళు ఎక్కువగా కాంతి వచ్చేటువంటి వాటిని చూడక పోవడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. తాజాగా కొంతమంది వ్యక్తులను తీసుకొని పరిశోధనలు చేయగా ఇందులో కొంతమంది మాత్రమే రాత్రి సమయాలలో చీకటిని కలిగి ఉన్నారని మరికొంతమంది లైట్స్ వేసుకొని నిద్రపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. అయితే వీరందరూ ఊబకాయం, మధుమేహం ,అధిక రక్తపోటు సమస్యలు ఉన్న వారిగా గుర్తించారు.

అయితే మనం నిద్రించేటప్పుడు.. రాత్రిపూట పాదాలు తిమ్మిరి వేయడం, సరిగ్గా జీర్ణం కాకపోవడం ఆంటీ సమస్యలు ఎదురైతే ఇలాంటి వారు రాత్రి సమయాలలో లైట్స్ ఆఫ్ చేసుకోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. మనిషి ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అంత మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎక్కువ కాంతిని వెదజల్లే లైట్స్ కాకుండా .. అందుకు బదులుగా డిమ్ లైట్ వేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఎరుపు రంగు కాంతి మెదడును బాగా ఉత్తేజపరిచేలా చేస్తాయి.. తెలుపు , నీలం వంటి రంగులలో ఉన్న లైట్లను ఉపయోగించకూడదు. అందుచేతనే రాత్రి సమయాల్లో నిద్రించే వారు లైట్ ఆఫ్ చేసుకుని నిద్రించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version