మీ జీమెయిల్ హ్యాక్ అయిందేమో అని అనుమానమా..? అయితే ఇలా తెలుసుకోండి..!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆన్లైన్ లో మోసాలు జరుగుతున్నాయి. అకౌంట్ ని హ్యాక్ చేయడం వంటివి చేస్తున్నారు. అయితే మనం ఎక్కువగా ఈ మెయిల్స్ ని పంపించు కోవడం కోసం జీమెయిల్ వాడతాము. జీమెయిల్ ని వాడినప్పుడు మీకేమైనా మీ అకౌంట్ హ్యాక్ చేశారని అనిపిస్తే ఇలా చెక్ చేసుకోవచ్చు.

సైబర్ నేరగాళ్లు జీమెయిల్ ఖాతాలని లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నారు. దీంతో యూజర్స్ బ్యాంకింగ్ వివరాలతో పాటు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా హ్యాకర్లు చేతికి చేరిపోతుంది. అయితే ఒకవేళ మీ జీమెయిల్ కూడా హ్యాక్ చేశారని అనిపిస్తే ఇలా తెలుసుకోండి.

ఒకవేళ కనుక హ్యాకర్స్ జీమెయిల్ ఖాతాను హ్యాక్ చేశారంటే ముందు పాస్వర్డ్ రికవరీ, ఫోన్ నెంబర్ వంటి సమాచారాన్ని మార్చేస్తారు కాబట్టి మీకు అనుమానం కలిగితే ఒకసారి మీ జీమెయిల్ ఓపెన్ చేసి చూడండి. లాగిన్ అవ్వకపోతే కచ్చితంగా మీ అకౌంట్ హ్యాక్ చేశారని మీరు తెలుసుకోవాలి. తిరిగి మీ అకౌంట్ పొందాలంటే జీమెయిల్ అకౌంట్ రికవరీ పేజీ లోకి వెళ్లాలి. అక్కడ ఉండే క్వషన్స్ కి ఆన్సర్ చేసి తిరిగి మళ్లీ మీరు మీ అకౌంట్ ని పొందొచ్చు.

అలానే జీమెయిల్ ఖాతాలో అనుసంధానమైన రికవరీ మెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేస్తే దానికి రికవరీ పాస్వర్డ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే జీమెయిల్ అకౌంట్ రికవరీ అవుతుంది. ఒకవేళ ఎవరు మీ అకౌంట్ ని ఉపయోగించారు..? ఎక్కడ ఉపయోగించారు అనేది తెలుసుకోవాలంటే గూగుల్ లోకి వెళ్లి ఎడమ వైపు మెనూలో సెక్యూరిటీ పై క్లిక్ చేయాలి.

అందులో రీసెంట్ సెక్యూరిటీ ఆక్టివిటీ ప్యానల్ ఓపెన్ చేస్తే మీ ఖాతాను ఎవరి లాగిన్ చేసారో తెలుస్తుంది. ఒకవేళ కనుక అది మీరు ఉపయోగించనట్లయితే స్క్రీన్ మీద ఉన్న సూచనలను అనుసరించి మీ జిమెయిల్ ఖాతాను మరింత సెక్యూరిటీ గా ఉంచుకోవచ్చు. ఒకవేళ కనుక మీ జీమెయిల్ ఖాతా భద్రత పై మీకు అనుమానాలు ఉంటే వెంటనే పాస్వర్డ్ ని మార్చుకోండి ఇలా మీ జీమెయిల్ ని సురక్షితంగా ఉంచచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news