SURYA : దేవరకొండ చేతుల మీదుగా “ఈటీ” ట్రైలర్‌ రిలీజ్‌

-

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ వంటి అద్భుత‌మైన చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసిన కోలివుడ్ స్టార్ సూర్య…ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. స‌న్ పిక్ష‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మాత‌గా పాండిరాజ్ ద‌ర్శ‌కత్వంలో వ‌స్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం ఈటీ {ఎవరికీ తలవంచడు}.

సూర్య‌కు ఉన్న భారీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తెలుగులో ఈటీ పేరుతో విడుద‌ల చేయ‌బోతుంది. ఈ చిత్రం హ‌క్కుల‌ను ఫ్యాన్సీ ధ‌ర‌కు ఏషియ‌న్‌సంస్థ సొంతం చేసుకున్న‌ద‌ట. త‌మిళ వెర్ష‌న్‌తో పాటు తెలుగులో కూడా చిత్రం మార్చి 10న ఒకేసారి విడుద‌ల కానున్న‌ది.

ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్, డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న ప్రియాంక అరుల్ మోహ‌న్ న‌టించింది. అయితే.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌ ను టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు.ఎప్పటి లాగా ఈ ట్రైలర్‌ లో హీరో సూర్య తన యాక్టింగ్‌ తో ఇరగదీశాడు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్‌ యాంగిల్లో తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే మనకు అర్థమౌవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news