ఆఫ్‌ట్రాల్‌ ఆవాలు.. వంటలో వాడకపోతే ఏమైతుందిలే అనుకుంటున్నారా..? ఈ విషయాలు మీకోసమే..!

-

సాధారణంగా వంటలో ఏదైనా ఎక్కువైతే.. దాని టేస్ట్‌ మారిపోతుంది. కానీ ఆవాల విషయం వచ్చేసరికి ఇవి ఎక్కువైతే కాదు.. మాడిపోతుంది ఆ వంట టేస్ట్‌ మారిపోతుంది. ఆవాలు ఏదో కలర్‌ఫుల్‌గా ఉండేందుకు వేస్తుంటారు అని చాలా మంది అనుకుంటారు. పులిహోర విత్‌ఔట్‌ ఆవాలు అసలు ఊహించుకోండి..ఏం బాగుండదు కదా..! పప్పు కూడా అంతే. తాలింపుల్లో ఆవాలు, కరివేపాకు హవానే వేరు. ఆవాలు అలంకారం కోసం కాదు.. వాటి వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఈరోజు మనం ఆవాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

అవాలు రోజూ తినడం వల్ల మనకు తగిలిన గాయాలు త్వరగా మారడానికి అవకాశం ఉంటుంది.
ఆవాలను పొడిలా చేసి ఆ పొడిని గాయాలపై పెట్టడం వల్ల కూడా త్వరగా గాయం నుంచి బయటపడవచ్చు.
ఆవాలు తినే వారిలో దంత సమస్యలు కూడా తక్కువగా వస్తాయని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా పంటి నొప్పితో బాధపడేవారు. ఆవాలను మరిగించిన నీటిని తాగడం లేదా పుక్కిలించి ఉమ్మడం వంటివి చేస్తే పంటి నొప్పి త్వరగా తగ్గుతుంది.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా ఆవాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
ఆయుర్వేదంలో ఆవాలు స్థానం ప్రధానమైనది.
చాలామంది కీళ్ల నొప్పుల బారిన పడతారు. దీని కారణంగా నడవలేకపోతూ ఉంటారు. అలాంటి వారు ఆవాలతో ఉపశమనం పొందొచ్చు. ఒక టీ స్పూన్ ఆవాల పొడి, కర్పూరం కలిపి మెత్తని పొడిలా చేయాలి. కాస్త నీళ్లు కలిపి పేస్టులా చేసి కీళ్లనొప్పులు వస్తున్నచోట రాయాలి. ఇలా రాయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.
ఆవపిండి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరం వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని పొందుతుంది. జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఆవ పిండి త్వరగా బయటపడేలా చేస్తుంది.
గజ్జి, తామర వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆవాలను వినియోగించవచ్చు.
ఆవాలు కాస్త నీళ్లు వేసి మెత్తటి ముద్దలా నూరి ఆ మిశ్రమాన్ని గజ్జి, తామర వచ్చిన చోట పూయాలి. ఇలా తరచూ చేస్తే కచ్చితంగా నయం అవుతాయి. ఆవనూనెను శరీరం అంతా రాసుకొని కాసేపు ఎండలో కూర్చుంటే రికెట్స్ వ్యాధి తగ్గిపోతుంది.
ఫుడ్ పాయిజన్ వల్ల పొట్టలో తిప్పుతున్నట్టు అనిపిస్తుంటే ఒక స్పూను ఆవపిండిని నీళ్లలో కలుపుకొని తాగేయాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉన్న ఆహారం వాంతి రూపంలో బయటికి వచ్చేస్తుంది. దీనివల్ల పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.

ఆఫ్‌ట్రాల్‌ ఆవాలు అనుకున్నాం కదా..! చూశారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అందుకే దేన్ని లైట్‌ తీసుకోకూడదు మరీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version