60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి 418 రాళ్లు తొలగించిన డాక్టర్లు

-

కిడ్నీలో ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 418 రాళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. హైదరాబాద్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్యులు అరుదైన వైద్యం చేశారు. 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి 418 రాళ్లను బయటకు తీశారు. 27శాతం మాత్రమే కిడ్నీ పనిచేస్తుండటంతో ఇటీవల అతడు వైద్యులను సంప్రదించగా.. పరీక్షలు చేసి, కిడ్నీలో చిన్న చిన్న రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద సర్జరీ అవసరం లేకుండా PCNL టెక్నిక్ ద్వారా 2 గంటలు శ్రమించి ఈ రాళ్లు మొత్తాన్ని డాక్టర్లు తొలగించారు.ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్ తక్, డాక్టర్ దినేశ్ పాలుపంచుకున్నారు.

శరీరంపై అతి తక్కువ కోతతో కిడ్నీలో రాళ్లను తొలగించే ఈ ఆధునిక వైద్య విధానం పేరు పెర్కటేనియస్ నెఫ్రోలిథోటమీ.ఈ విధానంలో లేజర్ ఆధారిత ప్రత్యేకమైన పరికరాలను కిడ్నీలోకి చోప్పించి తొలగించవలసిన భాగాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతారు. ఎందుకంటే ఇందులో కెమెరా కూడా ఉంటుంది. నీతో శరీరంపై ఎక్కువ పూత పెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ సర్జరీ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news