ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం తాగడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది అన్న ప్రచారం కూడా ఊపందుకోవడంతో అలవాటు లేనివారు కూడా ప్రస్తుతం మద్యం తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మద్యం తాగడం ద్వారా నిజంగానే రోగనిరోధక శక్తి పెరుగుతుందా అంటే వైద్య నిపుణులు మాత్రం ముమ్మాటికి కాదు అని సమాధానం ఇస్తున్నారు.
మద్యం తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది తప్ప ఎక్కడా పెరగదు అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. ఇక తరచూ మద్యం తాగడం ద్వారా రోగనిరోధక శక్తి తగ్గడం తో పాటు అవయవాలపై ప్రభావం వుంటుందని.. అంతే కాకుండా ఊపిరితిత్తుల్లోకి హానికరమైన వైరస్లను రాకుండా అడ్డుకునే కణాలను కూడా మద్యం దెబ్బతీస్తుంది అంటూ చెబుతున్నారు. తద్వారా కరోనా వైరస్ లాంటి హానికరమైన వైరస్లు ఎంతో సులభంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.