ఢిల్లీలో అలా చేస్తే ఇక కోటిరూపాయల జరిమానా…!

-

ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీగా జరిమానా, జైలుశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిప్రకారం కాలుష్య కారకులకు ఏకంగా కోటి రూపాయల జరిమానా , గరిష్టంగా ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఆర్డినెన్స్‌ను కేంద్ర న్యాయ శాఖ విడుదల చేసింది.

దీని ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ నిమిత్తం… 22 ఏళ్ల క్రితం నాటి ఎన్విరాన్‌మెంట్‌ పొల్యూషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ అథారిటీ ని రద్దు చేసి దాని స్థానంలో ఒక ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్‌లో 20 మందికిపైగా సభ్యులు ఉంటారు. కమిషన్‌ చైర్మన్‌ను కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో రవాణా, వాణిజ్య, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు, కేబినెట్‌ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news