అల్లరి నరేష్ హీరో అన్న విషయం ఆయన భార్యకు తెలియదా..?

-

ప్రముఖ దర్శకుడు ఈ వీ వీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అల్లరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి సినిమాతోనే అల్లరి సినిమాను ఇంటిపేరుగా పెట్టుకొని అల్లరి నరేష్ గా మారిపోయారు నరేష్ . ఇలా ఇండస్ట్రీలో పలు కామెడీ సినిమాలలో నటించి కామెడీ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన.. క్రమక్రమంగా సినిమాలు ఎంపిక విషయంలో తడబడటంతో వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. అలా నటుడిగా కొనసాగుతున్న సమయంలోనే వివాహం చేసుకున్న ఈయన ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాలలో నటించాడు. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు.

ఈ విధంగా వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నరేష్.. గత ఏడాది నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటూ వెళ్తున్న ఈయన ఇటీవల ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ తన భార్య విరూపా గురించి మాట్లాడుతూ.. కొన్ని ఆశ్చర్యపోయే విషయాలను తెలియజేశారు.. విరూపా చిన్నప్పటినుంచి చెన్నైలోనే పుట్టి పెరగడం వల్ల తనకు పెద్దగా తెలుగు సినిమాల గురించి అవగాహన లేదు అని తెలిపారు.

ఒకవేళ తెలుగు సినిమాలు చూసినా..స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చూసేది. అందుకే తాను హీరో అన్న విషయం ఆమెకు పెళ్లి ముందు వరకు కూడా తెలియదు. ఒకవేళ సినిమాలలో ఉన్నానంటే హీరోగా కాకుండా వేరే డిపార్ట్మెంట్లో చేస్తున్నానని అనుకుంది. పెళ్లి తర్వాత నేను హీరో అనే విషయం ఆమెకు తెలిసింది అంటూ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news