మళ్లీ నడక నేర్చుకుంతున్నా అంటున్న బుట్ట బొమ్మ..

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఈ మధ్య కాలికి గాయం అవ్వడంతో ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే తన ఎడమ కాలికి గాయం అవటంతో రెస్ట్ తీసుకుంటున్న ఈమె.. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు అభిమానులకు అందుబాటులో ఉంటుంది అయితే తాజాగా వాకర్ పట్టుకొని నడుస్తున్న పూజ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ ను రాసుకొచ్చింది..

తన కాలికి తగిలిన గాయంతో ఇంకా నడవలేని స్థితిలోనే ఉంది బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఇప్పుడిప్పుడే వాకర్ పట్టుకొని నెమ్మదిగా అడుగులేస్తూ ఉన్న ఈమె ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితం అయింది.. అయితే తాజాగా తన కాలి గాయానికి సబంధించిన ఓ అప్ డేట్ ఇచ్చింది పూజా హెగ్డే. వాకర్ పట్టుకుని నడుస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఈమె జీవితంలో రెండోసారి మళ్లీ నడక నేర్చుకుంటున్న అంటూ తయారు చేసింది.. నర్సు సహాయంతో నెమ్మదిగా అడుగులేస్తున్న పూజ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులంతా ధైర్యంగా ఉండాలి పూజ మీరు తొందరలోనే తప్పకుండా కోలుకొని తిరిగి షూటింగ్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు..

ప్రస్తుతం పూజా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ జోడీగా కిస్ కా బాయ్.. కిస్ కా జాన్ సినిమాలో నటిస్తోంది.. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే గాయపడింది పూజా. దాంతో ఆ సినిమాతో పాటు… పూజా టాలీవుడ్ లో కమిట్ అయిన త్రివిక్రమ్ – మహేష్ సినిమాకు కూడా బ్రేక్ వచ్చింది. అలాగే వచ్చే నెలలో మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికి ఆ షూటింగ్ లో జాయిన్ కాబోతుందట పూజా. ఇక ఈ సినిమాలతో పాటు రణ్ వీర్ సింగ్ తో సర్కస్ మూవీలో కూడా కనిపించబోతోంది బ్యూటీ. పూజా హెగ్డే చివరిగా బీస్ట్ సినిమాలో మెరిసింది .

Read more RELATED
Recommended to you

Latest news