మన దేశంలో దేవుడిని ఎంతగా ఆరాధిస్తారు అన్న విషయం అందరికి తెలిసిందే..అందుకే భారతదేశంలో దేవాలయాలు ఎక్కువ అని అంటారు.మన దేశం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఆచార వ్యవహారాలతో పాటు, కొన్నిటిని కూడా ఎంతగానో నమ్ముతున్నారు..మనం నివసించే ప్రాంతాలలో ఎటువంటి శక్తులు, నర దిష్టి తగలకుండా ఇంటి బయట, దుకాణం బయట నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం చాలా మంది చూసే ఉంటారు.
మరి కొంతమంది గుమ్మడి కాయలు, కొబ్బరికాయ, కలబందను కూడా కడతారు..అయితే నిమ్మకాయలు ఎందుకు గుమ్మానికి కడతారు అనే విషయం గురించి చాలా మందికి తెలియదు.మన ఇంటికి ఎలాంటి చెడు దృష్టి తగలదని, ఎలాంటి ఆత్మలు, ప్రేతాత్మలు దరి చేరవని చెబుతారు. నిజానికి అసలు కారణం ఇదికాదు. రాత్రి సమయంలో కూడా కరెంటు లేకపోవటం వల్ల ఎన్నో క్రిమికీటకాలు ఇంటిలోకి వచ్చేవి.అయితే ఈ క్రిమికీటకాల నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలను మిరపకాయలను సూదితో గుచ్చడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్స్, నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ వాసనలు బయటకు వెదజల్లడం వల్ల ఎలాంటి క్రిమికీటకాలు దరిచేరవు. ఈ కారణం చేత పూర్వకాలంలో పెద్దవారు ఇంటి గుమ్మానికి పచ్చిమిరపకాయలు నిమ్మకాయను దారంతో వ్రేలాడ తీసేవారు.
ఇక కొందరు నదిలో రూపాయి బిళ్ళలు లేదా ఏదైనా నాణేలకు వేస్తారు.నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దాని వల్ల తాగునీటిలో ఎలాంటి కలుషితాలు ఉన్నా తొలగిపోతాయని అలా చేసేవారు. పైగా అప్పట్లో అంతా నదుల్లో నీటిని నేరుగా తాగేవారు. ఇప్పటిలా ఫిల్టర్లు లేవు. అందుకే రాగి నాణేలు వేసి నీటిని శుభ్రపరిచేవారు. ఈ రోజుల్లో రాగి నాణేలు లేవు అయినా నదిలో నాణేలు వేయడం మాత్రం ఆగలేదు..కాలాలు మారిన కూడా కొన్ని సంప్రదాయాలు మారక పోవడం నిజంగా గ్రేట్..అది మన దేశ సాంస్కృతిని పెంచుతుంది.